విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN , First Publish Date - 2022-07-07T05:55:28+05:30 IST

మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యుడు మూడావత జగననాయక్‌ డిమాండ్‌ చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
వంట పాత్రలతో రాస్తారోకో నిర్వహిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

మిర్యాలగూడ, జూలై 6: మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యుడు మూడావత జగననాయక్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో తుంగపాడు మోడల్‌ స్కూల్‌ ఎదుట కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై సుమారు గంటసేపు ధర్నా నిర్వహించారు. వి ద్యార్థులకు వండిన వంటపాత్రలను రోడ్డుపైకి తీసుకువచ్చారు. స క్రమంగా ఉడకని భోజనం విద్యార్థులు ఎలా తింటారని ప్రశ్నించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు ఉడికీ ఉడకని భోజనం వడ్డిస్తున్నారని ఆరోపించారు.  ప్ర భుత్వం మధ్యాహ్న భోజనం మెనూ పెంచాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేక పేద, మధ్య తరగతి విద్యార్థులు సరైన విద్యను అభ్యసించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకోవడంపై చూపిన శ్రద్ధ వి ద్యాసంస్థల బలోపేతం చేయడంపై చూపడం లేదని ఆయన వి మర్శించారు. పాఠశాల యాజమాన్యం భోజన సదుపాయాలను ని త్యం పర్యవేక్షించాలని కోరారు. మరోసారి ఇలా జరగకుండా చూ స్తామని ఎంఈవో బాలాజీనాయక్‌ హామీ మేరకు ధర్నా విరమించారు. ధర్నా కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ డివిజన కమిటీ సభ్యులు తరుణ్‌, సుమన, ఉపేందర్‌, చందు, భరత, స్వామి, లక్కి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-07T05:55:28+05:30 IST