దేశీ వరి విత్తనాలతో నాణ్యమై దిగుబడి

ABN , First Publish Date - 2021-10-24T06:54:29+05:30 IST

: దేశీ వరి విత్తనాలతో నాణ్యమై పంట దిగుబడి వస్తుందని కేవీకే శాస్త్రశేత్త బి. లవకుమార్‌ అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో దేశీ వరిసాగు చేస్తున్న రైతు ఎలుగూరి సుదర్శన్‌రెడ్డి సాగు చేస్తున్న వరి క్షేత్రాన్ని సందర్శించారు.

దేశీ వరి విత్తనాలతో నాణ్యమై దిగుబడి
వరి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్త లవకుమార్‌

నేరేడుచర్ల, అక్టోబరు 23: దేశీ వరి విత్తనాలతో నాణ్యమై పంట దిగుబడి వస్తుందని కేవీకే శాస్త్రశేత్త బి. లవకుమార్‌ అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో దేశీ వరిసాగు చేస్తున్న రైతు ఎలుగూరి సుదర్శన్‌రెడ్డి సాగు చేస్తున్న వరి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూదేశ్వర్‌ వరి బియ్యంను బాలింతలు ఆహారంగా తీసుకుంటే పాలు పెరగడంతో పాటు పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. రక్తశాలి రకం వరి ఎరుపు రంగులో ఉండడంతో పాటు అత్యంత పోషక విలువలు కలిగి ఉంటాయన్నారు. కార్యక్రమంలో హైద్రాబాద్‌ లయోలా కళాశాల వ్యవసాయ డిగ్రీ విద్యార్థులు ఉదయ్‌ కిరణ్‌, హరీష్‌, ప్రాన్సిస్‌లతో పాటు రైతు మల్గిరెడ్డి వెంకటరెడ్డి తదితరులున్నారు.



Updated Date - 2021-10-24T06:54:29+05:30 IST