మలబద్ధకం మాయం!

Published: Tue, 09 Jun 2020 11:15:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మలబద్ధకం మాయం!

ఆంధ్రజ్యోతి (09-06-2020): మలబద్ధకం అరుదుగా తలెత్తడం సహజం. అయితే లాక్‌డౌన్‌ మూలంగా జీవనశైలి క్రమం తప్పి, ఆ కారణంగా మలబద్ధకం తలెత్తడం ఎక్కువమందిని తరచుగా వేధిస్తున్న ప్రస్తుత సమస్య. దీన్నే ‘క్వారంటైన్‌ కాన్‌స్టిపేషన్‌’ అని అంటున్నాం. ఈ ఇబ్బంది తొలగించడానికి ఉపయోగపడే యోగాసనాలు ఉన్నాయి. అవేమిటంటే....


పవనముక్తాసనం: విశ్రాంత స్థితిలో వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను మడిచి, పొత్తికడుపు దగ్గరకు తీసుకురావాలి. రెండు చేతులతో మోకాళ్లను బిగించి, దగ్గరకు లాక్కోవాలి. తలను పైకెత్తి, గడ్డం ఛాతీకి ఆనించాలి. ఈ భంగిమలో 5 సెకండ్ల పాటు ఉండి, తిరిగి యథాస్థితికి రావాలి.


మాలాసనం: కాళ్ల మధ్య ఎడం ఉండేలా నిలబడాలి. మోకాళ్లు వంచి, నేల మీద స్క్వాట్‌ పొజిషన్‌లో కూర్చోవాలి. చేతులు రెండు జోడించి, మోచేతులు మోకాళ్లకు ఆనేలా శరీరం దగ్గరకు చేతులను తీసుకురావాలి. వెన్ను, మెడ నిటారుగా ఉంచి, భుజాలను రిలాక్స్‌డ్‌గా ఉంచాలి. ఈ భంగిమలో ఐదు సార్లు శ్వాస తీసుకునేంత సమయం ఉండి యథాస్థితికి రావాలి.


బాలాసనం: మోకాళ్ల మీద కూర్చుని, ముందుకు వంగాలి. పొత్తికడుపు తొడలకు తగిలేలా, తల నేల మీద ఆనేలా ముందుకు వంగాలి. రెండు చేతులను తల మీదుగా చాపి, నేలను తాకించాలి. ఈ భంగిమలో ఐదు సార్లు శ్వాస తీసుకునేంత సమయం ఉండి యథాస్థితికి రావాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.