ఆటుపోట్లకు అవకాశం

ABN , First Publish Date - 2021-01-25T07:59:20+05:30 IST

డెరివేటివ్స్‌ ముగింపు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి. మరోవైపు ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌తో మార్కెట్లు కొంత ఆటుపోట్లకు

ఆటుపోట్లకు అవకాశం

డెరివేటివ్స్‌ ముగింపు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు  ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి. మరోవైపు ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌తో మార్కెట్లు కొంత ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. లాభాల స్వీకరణకు అవకాశాలెక్కువగా ఉన్నాయి. నిఫ్టీకి 14500-14632 వద్ద నిరో ధం ఎదురుకావచ్చు. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ను కనబరిస్తే 14222 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. 


స్టాక్‌ రికమండేషన్స్‌

టీడబ్ల్యూఎల్‌: నెలవారీ చార్టుల ప్రకారం చూస్తే రెండున్నరేళ్ల అనంతరం ఈ షేరు బుల్లిష్‌ ట్రెండ్‌లోకి అడుగుపెట్టింది. గత శుక్రవారం రూ.55.70 వద్ద క్లోజైన ఈ షేరు రూ.53 నుంచి రూ.49 స్థాయిలకు పడిపోయినప్పుడు రానున్న వారాలు, నెలల కోసం రూ.74 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.44 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌: డైలీ చార్టుల ప్రకారం చూస్తే ఈ షేరు రూ.918 స్థాయిల నుంచి పడిపోతూ వస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.893 వద్ద క్లోజైంది. రానున్న వారాలకు ఈ షేరు రూ.900-910 దిశగా సాగితే ట్రేడర్లు రూ.860-830 స్థాయిని టార్గెట్‌గా పెట్టుకుని విక్రయించే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.935 స్థాయిని మాత్రం కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. 


టాటా స్టీల్‌: డైలీ చార్టుల ప్రకారం ఈ షేరు గత ఏడాది సెప్టెంబరు తర్వాత తొలిసారిగా లోయర్‌ టాప్‌, లోయర్‌ బాటమ్‌ను కనబరిచింది. ప్రస్తుతం కొద్దిగా బలహీనతను సూచిస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.646.85 వద్ద క్లోజైంది. రానున్న రోజులకు ఈ షేరు రూ.620-600 దిశగా సాగితే లాభాల స్వీకరణ కొనసాగే అవకాశాలున్నాయి. ఒకవేళ ఈ షేరు రూ.650-655 స్థాయిలకు బౌన్స్‌ అయితే ఈ షేరును విక్రయించే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.675 స్థాయిని మాత్రం కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలి్‌స్ట,టెక్నికల్‌,

డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌


నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - 2021-01-25T07:59:20+05:30 IST