మా అమ్మ గుర్తొచ్చింది.. ఇంగ్లండ్ రాణితో మీటింగ్ తర్వాత బైడెన్

ABN , First Publish Date - 2021-06-14T23:24:41+05:30 IST

జీ7 దేశాల సమావేశం కోసం బ్రిటన్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. ఆ దేశ మహారాణి క్వీన్ ఎలిజబెత్ IIను కలిసిన సంగతి తెలిసిందే.

మా అమ్మ గుర్తొచ్చింది.. ఇంగ్లండ్ రాణితో మీటింగ్ తర్వాత బైడెన్

లండన్: జీ7 దేశాల సమావేశం కోసం బ్రిటన్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. ఆ దేశ మహారాణి క్వీన్ ఎలిజబెత్ IIను కలిసిన సంగతి తెలిసిందే. ఇది అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బైడెన్ చేసిన తొలి విదేశీ పర్యటన. ఈ క్రమంలో ఎలిజబెత్ రాణిని కలిసిన ఆయన.. ఇంగ్లండ్ మహారాణి తన తల్లిని గుర్తుచేసిందని చెప్పారు. జీ7 మీటింగ్ పూర్తవడంతో లండన్ నుంచి వెళ్తూ మీడియాతో మాట్లాడిన బైడెన్.. క్వీన్ ఎలిజబెత్ గురించి మాట్లాడారు. ‘‘ఆమె తప్పుగా భావిస్తారని అనుకోను.. ఆమె నాకు మా అమ్మను గుర్తు చేసింది. ఆమె తీరు, మంచితనం అమ్మలానే అనిపించాయి’’ అని చెప్పారు. ఆమె చాలా హుందాగా కనిపించారని, అందులో ఎటువంటి ఆశ్యర్యమూ లేదని చెప్పిన ఆయన.. తామిద్దరి మధ్య గొప్ప చర్చ జరిగిందని వెల్లడించారు.

Updated Date - 2021-06-14T23:24:41+05:30 IST