బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రశ్నార్థకంగా విద్యాభ్యాసం!

ABN , First Publish Date - 2022-09-24T17:44:21+05:30 IST

గ్రామీణ విద్యార్థులకు సాంకేతికవిద్యను అందించాలని లక్ష్యంతో ఏర్పాటైన బాసర ట్రిపుల్‌ఐటీ(Basara TripleIT) (ఆర్జీయూకేటీ)లో నాణ్యమైన విద్యాభ్యాసం ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ చేరే విద్యార్థులకు లాప్‌టాప్‌ అందించి కార్పొరేట్‌ స్థాయి వసతులు

బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రశ్నార్థకంగా విద్యాభ్యాసం!

బాసర ట్రిపుల్‌ ఐటీలో మూడేళ్లుగా అందని లాప్‌టాప్‌లు 

నాలుగున్నర వేల మంది విద్యార్థుల ఎదురుచూపులు 

బడ్జెట్‌ లేక నిలిచిపోయిన ల్యాప్‌టాప్‌ల పంపిణీ 

ప్రత్యామ్నాయం చూస్తున్న అధికారులు 

ఇవ్వకుంటే కష్టమంటున్న విద్యార్థులు 


బాసర, సెప్టెంబరు, 23 : గ్రామీణ విద్యార్థులకు సాంకేతికవిద్యను అందించాలని లక్ష్యంతో ఏర్పాటైన బాసర ట్రిపుల్‌ఐటీ(Basara TripleIT) (ఆర్జీయూకేటీ)లో నాణ్యమైన విద్యాభ్యాసం ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ చేరే విద్యార్థులకు లాప్‌టాప్‌ అందించి కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పించి పేద విద్యార్థులు నిపుణులుగా తీర్చిదిద్దాలనేది ప్రధానం ఉద్దేశం. 2008 సంవత్సరంలో యూనివర్సిటీ ఏర్పాటైన నాటి నుంచి ప్రతీఏడాది విద్యార్థులకు లాప్‌ టాప్‌ల పంపిణీ(Laptops Distribution) జరుగుతుంది. కరోనా కారణంగా కొత్తగా చేరే వారికి అందించే లాప్‌టాప్‌ల పంపిణీ 2020లో నిలిచిపోయింది. ఆ తర్వాత గతఏడాది అడ్మిషన్‌ పొంది న విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్‌లు అందించలేదు. తాజాగా మరో 1500ల మంది విద్యార్థులు ప్రవేశం పొం దారు. ఇలా నాలుగున్నర వేలమంది విద్యార్థులు లాప్‌ టాప్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ట్రిపుల్‌ఐటీలో చేరే విద్యార్థుల్లో 99 శాతం గ్రామీణ ప్రాంత పేద, నిరుపేద విద్యార్థులే ఉన్నారు. కనీసం పరీక్ష ఫీజులు చెల్లించేం దుకు ఇబ్బంది పడేవారు లాప్‌టాప్‌లు స్వతహాగా కొను గోలు చేసుకునేంత స్థోమత అసలే లేదు. తప్పని పరి స్థితుల్లో లాప్‌టాప్‌లు లేకున్నా ఇంజనీరింగ్‌ను, ఐటీ చదువులు పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


లర్నింగ్‌ బై డూయింగ్‌కు.. 

తూట్లు అన్ని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్‌ కళాశాలల మాది రిగా కాకుండా అందుకు భిన్నంగా ట్రిపుల్‌ ఐటీలు ఏర్పాటయ్యాయి. కార్పొరేట్‌లో లేని విధంగా వసతులతో పాటు కొత్త విద్యావిధానాన్ని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశపె ట్టారు. అందుకే స్వల్పకాలంలోనే ఇక్కడ చదుకుంటున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలకు చేరారు. ఒక్కోతరగతి గదిలో 50 మంది విద్యార్థులుండగా ప్రతీవిద్యార్థికి బెంచ్‌ వద్ద లాప్‌టాప్‌ వినియోగించుకునేలా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటుంది. సరళమైన పద్దతిలో విద్యాబోధన జరిగేలా ప్రతితరగతిలో ప్రొజెక్టర్‌ ఉంది. ఏ విషయమైనా నేర్చుకు న్నది లాప్‌టాప్‌తో చదువుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో మాదిరి ట్రిపుల్‌ఐటీలో లర్నింగ్‌ బై డూయింగ్‌ విద్యా విధానం అమలు చేయడంతో ఇంటర్నెట్‌ అవసరమేర్ప డుతుంది. అందుకే ఇక్కడ చేరగానే ప్రతివిద్యార్థికి అన్ని వసతులతో పాటు లాప్‌టాప్‌లు అందించారు. ఈ ప్రక్రియ గత మూడేళ్ల నుంచి జరగడం లేదు. పదవ తరగతి తర్వాత ఇక్కడ చేరిన విద్యార్థులకు మొదటి నుండే ఐటీ క్లాసెస్‌ కంప్యూటర్‌ అవగాహన తరగతులు ఉంటాయి. లాప్‌టాప్‌లు లేకపోవడంతో తరగతులు తప్ప ప్రాక్టికల్‌గా నేర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. 


అటకెక్కిన విద్యార్థులకు ఇచ్చిన హామీ

జూన్‌ నెల 3వ వారంలో విద్యార్థులు యూనివర్సిటీలో నెలకొన్న సమస్యల గురించి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అప్పుడు వారు పేర్కొన్న 12 డిమాండ్లు, లాప్‌ టాప్‌లది కూడా ఒకటి. లాప్‌టాప్‌లు ఇవ్వకపోవడంతో సరిగా చదువుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశా రు. చివరికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చి చదువుకునేందుకు అవసరమైనవాటినన్నింటినీ వెంటనే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో ఆందోళన విరమించిన విద్యార్థులకు మూడు నెలల గడుస్తున్నా లాప్‌టాప్‌లు మాత్రం అందలేదు. ఈ ఏడాది కొత్తగా చేరి న విద్యార్థులతో పాటు పీయూసీ - 2, ఇంజనీరింగ్‌ మొద టి సంవత్సరం చదివే విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇవ్వాల్సి ఉంది. ల్యాప్‌టాప్‌లు లేకుండానే వారు తమ చదువును కొనసాగించాల్సి వస్తుంది. 


వేధిస్తున్న నిధుల కొరత 

ప్రస్తుతం యూనివర్సిటీలో నాలుగున్నర వేల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాల్సి ఉంది. వీటి కొనుగోలుకు రూ. 20- 25 కోట్ల నిధులు కావాల్సి ఉంది. యూనివర్సిటీకి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు జీత భ త్యాలకు మెస్‌ భోజన ఖర్చులకే సరిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి అవసరాలకు నిధులు రాక పోవడంతో లాప్‌టాప్‌ల పంపిణీ ప్రక్రియ పెండిం గ్‌లో పడుతూ వస్తుంది. అధికారులు మాత్రం ఇప్పట్లో నిధులు వచ్చే అవకాశం లేనందున ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసేందుకు చూస్తున్నారు కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నారు. కాని విద్యార్థులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ల్యాబ్‌లకు వెళ్లి ప్రతీ సారి చదువు కోలేమని, ల్యాప్‌టాప్‌లు ఉంటే చదువు కోవడానికి సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు. 


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం

ప్రస్తుతానికైతే లాప్‌టాప్‌లు ఇవ్వలేదు. మిగితా విద్యా సంస్థల్లో మాదిరిగా ఇక్కడ ఒక కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. విద్యార్థులు ఆ కంప్యూటర్లను వినియోగించుకోవచ్చు. విద్యార్థులకు చదువుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఇవన్నీ తాత్కాలికంగా ఏర్పడిన అసౌకర్యాలు, కొద్ది రోజుల్లోనే అన్ని సమస్యలు తొలగిపోతాయి. 

-(వెంకటరమణ, వైస్‌ ఛాన్స్‌లర్‌) 

Updated Date - 2022-09-24T17:44:21+05:30 IST