పిల్లనివ్వడానికి క్యూ కడుతున్నారు: మంత్రి

ABN , First Publish Date - 2021-07-27T04:03:45+05:30 IST

‘తెలంగాణ రాక ముందు పాలమూరుకు పిల్లను ఇవ్వాలలంటే తల్లిదండ్రులు భయపడేవారు. నీళ్ల కోసం బోరింగ్‌ కొట్టికొట్టి చేతులన్నీ అరిగిపోతాయని, బతుకు దెరువు ఉండదని అనుకునే వారు. ఆ పరిస్థితి మా రింది.

పిల్లనివ్వడానికి క్యూ కడుతున్నారు: మంత్రి
రేషన్‌ కార్డును అందిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబబూబ్‌నగర్‌, జూలై 26: ‘తెలంగాణ రాక ముందు పాలమూరుకు పిల్లను ఇవ్వాలలంటే తల్లిదండ్రులు భయపడేవారు. నీళ్ల కోసం బోరింగ్‌ కొట్టికొట్టి చేతులన్నీ అరిగిపోతాయని, బతుకు దెరువు ఉండదని అనుకునే వారు. ఆ పరిస్థితి మా రింది. ఇప్పుడు పిల్లనివ్వడానికి క్యూ కడుతున్నారు. పాలమూరు ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. రోడ్లు బాగయ్యాయి. నీళ్లు రోజూ వస్తున్నాయి. నివ సించేందుకు ఇతర ప్రాంతాల నుంచి పాల మూరుకు వస్తున్నార’ని ఎక్సైస్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్‌ కన్వెన్షన్‌ హాల్‌లో రేషన్‌ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో పాలమూరును అద్దంలా తీర్చిదిద్దుతామని, ఇక్కడ నివసించేవారి విలువ పెంచుతామని అన్నారు. పాలమూరుకు ఏమాత్రం సాయం చేయని వారు, బైపాస్‌ వస్తే తీసుకుపోయినవారు, బ్రిడ్జీలు తీసుకుని కట్టకుండా గాలికొదిలిన వాళ్లు చాలా మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడి విద్యావంతులు వాళ్ల మాటలు నమ్మబోరని అన్నారు. పాలమూరును కరాబ్‌ చేయడానికి వచ్చేవారికి ప్రజలు ధీటైన సమాధానం చెప్పాలని, పాలమూరులో రౌడీయిజం పోయిందని, కర్ఫ్యూలు లేవని, దాదాగిరి లేదని, 144 సెక్షన్‌లు పోయాయని, అక్కడక్కడ కొందరు చీడపురుగులు బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడుతున్నారని అన్నారు. అదికూడా ఎక్కువ రోజులు సాగదన్నారు. భారత్‌మాల రోడ్డు దివిటిపల్లి నుంచి కొత్త కలెక్టరేట్‌ మీదుగా వెళ్లాలని ఇదే బీజేపీ ప్రభుత్వం తయారుచేసిందని, దాన్ని కూడా నేను నా పొలాలకు డిమాండ్‌ రావాలని పొలం ముందుకెళ్లి తీసుకెళ్తున్నానని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు కూడా మీరు పాలమూరు బాగుపడొద్దని, ఈ భారత్‌మాలను మారుస్తాం అంటే మార్పిం చండని, సంతకం పెట్టమంటే పెడతానని అన్నా రు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకటయ్య పాల్గొన్నారు. 


యునెస్కో గుర్తింపు గర్వకారణం

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావ డం ఎంతో గర్వంగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రెండేళ్ల ప్రయత్నం ఫలితంగా రామప్ప దేవాలయం ప్రపంచ పర్యాటక పటంలో చోటు సంపాదించిందన్నారు.

Updated Date - 2021-07-27T04:03:45+05:30 IST