రాజీతోనే సత్వర న్యాయం

ABN , First Publish Date - 2022-06-27T05:51:30+05:30 IST

రాజీతోనే ఇరువర్గాలకు సత్వర, సమన్యాయం లభిస్తుందని సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శశిధర్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసులను అందరూ సామరస్య పూర్వకంగా, రాజీమార్గాన పరిష్కరించుకోవడం వల్ల ఇరువర్గాల వారికి లాభం చేకూరుతుందన్నారు.

రాజీతోనే సత్వర న్యాయం

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు శశిధర్‌రెడ్డి, లక్ష్మీశారద

జాతీయ లోక్‌ అదాలత్‌లో పలు కేసులు పరిష్కారం


సంగారెడ్డిక్రైం, జూన్‌26: రాజీతోనే ఇరువర్గాలకు సత్వర, సమన్యాయం లభిస్తుందని సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శశిధర్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసులను అందరూ సామరస్య పూర్వకంగా, రాజీమార్గాన పరిష్కరించుకోవడం వల్ల ఇరువర్గాల వారికి లాభం చేకూరుతుందన్నారు.  సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 బెంచీలు ఏర్పాటు చేయగా సంగారెడ్డిలో 7, జహీరాబాద్‌లో 2,నారాయణఖేడ్‌, జోగిపేటలో ఒకటి చొప్పున బెంచీలు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9531 కేసులు పరిష్కరించి రూ.3,65,40,288 నష్టపరిహారాన్ని కక్షిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి జి.సుదర్శన్‌, మూడో అదనపు జిల్లా జడ్జి పి.రాజు, సీనియర్‌ సివిల్‌ జడ్జి బి.పుష్పలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్‌.ఆశాలత, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.డి.అబ్దుల్‌ జలీల్‌, స్పెషల్‌ ఎక్సైజ్‌ కోర్టు జడ్జి జె.హన్మంతరావు, స్పెషల్‌ మొబైల్‌ కోర్టు జడ్జి ఎ.నిర్మల, అదనపు ప్రథమ శ్రేణి జడ్జి పి.తేజశ్రీ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.విష్ణువర్దన్‌రెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. 

  జహీరాబాద్‌ : జహీరాబాద్‌ కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో సివిల్‌ విభాగంలో 4 కేసులు, క్రిమినల్‌ విభాగంలో 23 కేసులు, 40 బ్యాంకు పిఎల్సీల కేసులు, 1615 పెట్టి కేసులు, 11 ఎక్సైజ్‌ కేసులు పరిష్కరించినట్లు  జహీరాబాద్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఓ కేసుకు సంబంధించి ఇరు పార్టీలకు కౌన్సిలింగ్‌ నిర్వహించి రూ.30 లక్షలకు రాజీ కుదిర్చారు. జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా మొత్తంగా రూ.1.30 కోట్లు వసూలు అయ్యాయని సీనియర్‌ సివిల్‌ జడ్జి, మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ  చైర్మన్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి జి అనూష, న్యాయవాదులు పాల్గొన్నారు.

  నారాయణఖేడ్‌ : నారాయణఖేడ్‌లో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 430 కేసులు పరిష్కరించామని జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రియాంక సిరిసిల్లా తెలిపారు. రాజీమార్గంతో కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.  కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మణ్‌రావు, మారుతిరెడ్డి, నర్సారెడ్డి, చంద్రశేఖర్‌రావు, నర్సింహారావు, సంగమేశ్వర్‌రెడ్డి, జీవన్‌, సుధాకర్‌, ఎస్‌ఐలు మొగులయ్య, లక్ష్మణ్‌, రఫీక్‌, నారాయణ, కోర్టు సిబ్బంది శ్రీనివాస్‌, సంజీవ్‌, తదితరులు పాల్గొన్నారు.  


మెదక్‌ జిల్లాలో 13,829 కేసులు పరిష్కారం

మెదక్‌ అర్బన్‌, జూన్‌ 26: రాజీమార్గమే శ్రేయస్కరమని, జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌లో మొత్తం 13,829 కేసులు పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద తెలిపారు. జిల్లా కోర్డు ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఆదివారం మెదక్‌ కోర్టు అవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ... కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథాచేసుకోకుండా లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ఉత్తమమన్నారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి జితేందర్‌, జ్యూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కల్పనా, పోలీసు, బ్యాంకు అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 

 నర్సాపూర్‌: నర్సాపూర్‌ కోర్టు ఆవరణలో నిర్వహించిన మెగా లోక్‌అదాలత్‌ సందర్భంగా  జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి కె.అనిత మాట్లాడారు. లోక్‌అదాలత్‌ ద్వారా కేసులను పరిష్కరించుకుని డబ్బును, సమయాన్ని ఆదా చేసుకోవచ్చన్నారు. వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా లైసెన్సు కల్గి ఉండాలని, వాహనానికి సంబంధించిన పత్రాలు ఉండాలన్నారు. కార్యక్రమంలో పీపీ రాఘవేందర్‌, ఏజీపీ సత్యనారాయణ, తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అంజిరెడ్డి, సీఐ ఎస్‌.కె.లాల్‌మదార్‌, ఎస్‌ఐలు గంగరాజు, రవికాంత్‌, న్యాయవాదులు జాఫర్‌, మోయినోద్దిన్‌, శ్రీనివా్‌సగౌడ్‌, ఎ.శ్రీనివా్‌సరావు, శ్రీనివా్‌సరెడ్డి, స్వరూపరాణి, శ్రీధర్‌రెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T05:51:30+05:30 IST