వంటలు
రాగి కేక్‌

రాగులతో వెరైటీ రుచులు

రాగుల్లో పోషకాలు పుష్కలం. అలా అని రోజూ రాగి ఇడ్లీ, రాగి దోశ తినలేం. అలాంటప్పుడు రాగి పిండితో చేసే బిస్కెట్లు, బర్ఫీ, కట్‌లెట్‌లు, జంతికలు లాంటివి చేసుకుంటే స్నాక్స్‌గా తినొచ్చు. వాటి తయారీ విశేషాలు ఇవి...


100 గ్రాముల రాగులలో పోషక విలువలు 

క్యాలరీలు - 320

ప్రొటీన్లు - 7.16గ్రా

కార్బోహైడ్రేట్లు - 66.82గ్రా

డైటరీ ఫైబర్‌ - 11.18గ్రా

క్యాల్షియం 344మి.గ్రా


కావలసినవి: రాగి పిండి- అరకప్పు, గోధుమపిండి- ఒక కప్పు, పంచదార- ముప్పావు కప్పు, కోకో పౌడర్‌- రెండు టేబుల్‌స్పూన్లు, బేకింగ్‌ సోడా- అర టీస్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌- ఒక టీస్పూన్‌, ఉప్పు- చిటికెడు, చిక్కటి పెరుగు- ముప్పావు కప్పు, పాలు - పావు కప్పు, నూనె- పావు కప్పు, వెనీలా ఎసెన్స్‌- ఒక టీస్పూన్‌, తేనె- రెండు టీస్పూన్లు, అరటిపండు- ఒకటి, నూనె- ఒక టీస్పూన్‌, మైదా- ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం: ఒక బౌల్‌లోకి రాగిపిండి, గోధుమపిండి, మైదా, కోకో పౌడర్‌, బేకింగ్‌సోడా, బేకింగ్‌ పౌడర్‌ తీసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి.మరొక బౌల్‌లో అరటిపండును తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. తరువాత అందులో పాలు, చిక్కటి పెరుగు, నూనె, వెనీలా ఎసెన్స్‌, తేనె, పంచదార వేసి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ బౌల్‌లో ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమం వేసి ఉండలు లేకుండా కలియబెట్టుకోవాలి.తరువాత కేక్‌పాన్‌కు నూనె రాసుకోవాలి. సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని పాన్‌లో పోయాలి.180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు ప్రీహీట్‌ చేసిన ఓవెన్‌లో 40 నిమిషాల పాటు బేక్‌ చేయాలి.తరువాత కేక్‌పాన్‌ బయటకు తీసి చల్లారిన తరువాత కేక్‌ను ముక్కలుగా కట్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


ప్రయోజనాలివి...

రాగుల్లో క్యాల్షియం మోతాదు ఎక్కువ. ఇది ఎదిగే పిల్లలకు మంచిది. ఆస్టియోపోరోసి్‌సతో బాధపడుతున్న వారు తినదగిన ఆహారం. 

డయాబెటి్‌సను నియంత్రణలో ఉంచుతుంది. షుగర్‌తో బాధపడుతున్న వారు బ్రేక్‌ఫా్‌స్టగా రాగులతో చేసిన ఇడ్లీ, దోశ, రోటీ లాంటివి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

హీమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉన్న వాళ్లకి ఇది మంచి ఆహారం. 

రాగులను తీసుకునే వారిలో ఒత్తిడి, ఆందోళన కూడా తక్కువే ఉంటుంది. దీనికి కారణం ఇందులో ఉండే ట్రిప్టోఫాన్‌, అమైన్‌యాసిడ్స్‌. 

బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం. ఎక్కువ సమయం పొట్ట నిండి ఉన్న ఫీలింగ్‌ను అందిస్తుంది.


Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.