వంటలు
రాగి జంతికలు

కావలసినవి : రాగి పిండి - పావుకేజీ, శనగపిండి - 150గ్రా, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. 


తయారీ విధానం: ఒక బౌల్‌లో రాగిపిండి, శనగపిండి తీసుకుని అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, కొద్దిగా నూనె, తగినంత ఉప్పు వేసి, సరిపడా నీళ్లు పోసుకుంటూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టం/చక్లీ పావులో పెట్టి ఒత్తుకోవాలి. చక్లీలు అన్నీ ఒత్తుకున్నాక ప్రీ హీటెడ్‌ ఓవెన్‌లో 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. జంతికలు ఏ ఆకారంలో ఉండాలన్నది మీ ఇష్టం. దాన్నిబట్టి జంతికల ప్లేట్‌ ఎంచుకోవాలి. వీటిని ఈవినింగ్‌ స్నాక్స్‌గా పిల్లలకు అందిస్తే ఇష్టంగా తింటారు.


Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.