రాగి లడ్డు

ABN , First Publish Date - 2020-09-12T17:22:58+05:30 IST

రాయలసీమ అనగానే రాగి ముద్ద గుర్తొస్తుంది. సీమ వాసులే కాకుండా తెలుగు నాట అందరూ రాగి ముద్ద రుచిని ఆస్వాదిస్తారు.

రాగి లడ్డు

రాయలసీమ అనగానే రాగి ముద్ద గుర్తొస్తుంది.  సీమ వాసులే కాకుండా తెలుగు నాట అందరూ రాగి ముద్ద రుచిని ఆస్వాదిస్తారు. రాగులతో రాగి ముద్ద ఒక్కటే కాకుండా రాగి లడ్డు, అంబలి, రాగి సంగటి, రాగి రొట్టె, ముసుండలు... వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. మీరూ ఆ రుచులను ట్రై చేయండి.


కావలసినవి: రాగి పిండి - ఒక కప్పు, పంచదార లేదా బెల్లం - పావు కప్పు, నెయ్యి - ఒక కప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌.


తయారీ: స్టవ్‌పై పాన్‌ పెట్టి ఒక టీస్పూన్‌ నెయ్యి వేయాలి. నెయ్యి కాస్త వేడి అయ్యాక రాగి పిండి వేసి వేగించాలి. వేగించుకున్న రాగి పిండిని ఒక పాత్రలోకి తీసుకుని, అందులో యాలకుల పొడి, పంచదార, నెయ్యి వేసి ఉండలు లేకుండా కలపాలి. అవసరమైన మేర నెయ్యి కలుపుతూ లడ్డూలు తయారుచేసుకోవాలి. ఈ లడ్డూలు పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి.

Updated Date - 2020-09-12T17:22:58+05:30 IST