రాగి రొట్టె

ABN , First Publish Date - 2020-09-12T17:45:54+05:30 IST

రాగి పిండి - ఒక కప్పు, మునగాకు - అరకప్పు, వెల్లుల్లి - రెండు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు

రాగి రొట్టె

కావలసినవి: రాగి పిండి - ఒక కప్పు, మునగాకు - అరకప్పు, వెల్లుల్లి - రెండు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, నువ్వులు - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - తగినన్ని.


తయారీ: ఒక పాత్రలో రాగి పిండి తీసుకుని అందులో మునగాకు, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ప్లాస్టిక్‌ కవర్‌పై నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్నచిన్న బాల్స్‌లా చేసుకోవాలి. తరువాత ఒక్కోదాన్ని ఒత్తుకుంటూ రొట్టెలా చేసుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి కొద్దిగా నూనె వేసుకుంటూ రొట్టెలు కాల్చాలి. వీటిని చట్నీతో లేదా పెరుగుతో తింటే రుచిగా ఉంటాయి.


Updated Date - 2020-09-12T17:45:54+05:30 IST