రాజీవ్‌ సేవలు అభినందనీయం

Published: Sat, 21 May 2022 21:49:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాజీవ్‌ సేవలు అభినందనీయం ఉదయగిరి : రాజీవ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న నాయకులు

ఉదయగిరి రూరల్‌, మే 21: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు ఎంతో అభినందనీ యమని నియోజకవర్గ కాంగ్రెస్‌  ఇన్‌చార్జి దుద్దుకూరు రమేష్‌నాయుడు అన్నారు. శనివారం స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో రాజీవ్‌ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలయ్య, నాయకులు హజరత్‌, వెంగయ్య, రమణయ్య, ధోనిశ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


 జలదంకిలో..


జలదంకి :  యువతకు 18 ఏళ్లకే ఓటుహక్కు కల్పించిన మహోన్నత వ్యక్తి రాజీవ్‌గాంధీ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వేలమూరి శివశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.  శనివారం జలదంకి బస్టాండు కూడలిలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన నివాళులు అర్పించారు. ఈ  కార్యక్రమంలో రాఘవరెడ్డి, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.


రాజీవ్‌ సేవలు అభినందనీయంజలదంకి : రాజీవ్‌గాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ నేతలు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.