Advertisement

రాశి బాక్సింగ్ అందుకేనట!

Feb 26 2021 @ 15:32PM

తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ రాశీ ఖన్నా. ప్రస్తుతం డిజిటల్ మీడియాపై దృష్టి సారించింది. ఒక హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు షాహిద్ కపూర్ సరసన రాశి నటిస్తోంది. కిక్ బాక్సింగ్ చేస్తున్న తన ఫొటోను రాశి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

 

ఆ ఫొటో గురించి ఆమె తాజాగా మాట్లాడింది. `చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌కు వెళుతుండడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. షాహిద్ వంటి హీరోతో కలిసి నటించడం ఆనందం కలిగిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసమే కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. అంతకు మించి ఆ పాత్ర గురించి నేనేం చెప్పలేను. కిక్ బాక్సింగ్, వర్కవుట్ల వల్ల మనం మరింత ఫిట్‌గా మారవచ్చు. బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి అది కూడా ఒక కారణమ`ని రాశి పేర్కొంది. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.