రాశీఖన్నా తెలివిగల సైకో!

Jun 10 2021 @ 18:24PM

‘మద్రాస్‌ కేఫ్‌’ వెబ్‌సిరీస్‌తో హిందీలో కథానాయుకగా పరిచయమైన రాశీఖన్నా చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లో నటించనున్నారు. 70 ఎంఎం స్ర్కీన్‌ మీదే కాకుండా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో కూడా సందడి చేయాలను కుంటున్నారామె! ఇప్పటికే రాజ్‌ అండ్‌ డీకే కాంబినేషన్‌లో షాహిద్‌కపూర్‌తో ఓ వెబ్‌ సిరీస్‌లో నటించనున్న ఆమె అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’లో కూడా కీలక పాత్ర పోషించనున్నారు. హాలీవుడ్‌ ‘లూథర్‌’ సిరీస్‌కు రీమేక్‌ ఇది. రాజేష్‌ మపుస్కర్‌ దర్శకుడు. ఇందులో అజయ్‌ దేవగణ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. రాశీఖన్నా తెలివిగల సైకో  కిల్లర్‌గా కనిపించనుందట. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సిరీస్‌ జులై 21 నుంచి సెట్స్‌ పైకి వెళ్లనుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ ఓటీటీ వేదికగా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. 
Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.