రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T04:58:27+05:30 IST

రైతు వ్యతి రేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ డిమాండ్‌ చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
వనపర్తిలో రాస్తారోకో చేస్తున్న పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు

- సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌

- ఢిల్లీలో రైతుల ఆందోళనకు ప్రజాసంఘాల సంఘీభావం

    వనపర్తి టౌన్‌/ పాన్‌గల్‌/ వీపనగండ్ల/ ఆత్మ కూరు/ మదనాపురం, డిసెంబర్‌ 3 : రైతు వ్యతి రేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, యూటీఎఫ్‌, కేవీపీఎస్‌ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నాయి. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, గోపా లకృష్ణ, సునిత, కురుమయ్య, పరమేశ్వరా చారి, సాయిలీల, కళ్యాణ్‌, మహేష్‌, రాధకృష్ణ, డి కృష్ణయ్య, అమీద్‌, బీసన్న, రాబర్ట్‌, నందిమల్ల రాములు పాల్గొన్నారు. 

- ఢిల్లీలో రైతుల ఆందోళనకు సంఘీభావంగా వనపర్తి రాజీవ్‌ చౌరస్తాలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గణేష్‌, నాయకులు చిన్న కురుమయ్య, చంద్రయ్య, భీష్మచారి, నాగేంద్రం, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. 

- పాన్‌గల్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో చేతి వృత్తి దారుల సంఘం జిల్లా కన్వీనర్‌ దేవేందర్‌, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గంధం భగత్‌, గిరిజన సంఘం నాయకుడు మతృనాయక్‌, డీవైఎఫ్‌ఐ నాయకులు కమలాకర్‌, ఆర్‌.మహేష్‌, కేవీపీఎస్‌ మండల నాయకుడు మల్లెపు ఆనంద్‌ పాల్గొన్నారు.

- వీపనగండ్లలో గురువారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డి.బాల్‌రెడ్డి నాయకులు ఎత్తం కృష్ణయ్య, ధర్మారెడ్డి, రాజు, కుర్మయ్య, నరసింహ, శేఖర్‌రెడ్డి, బాలరాజు, వీరబాబు, ఈశ్వర్‌, తిరుపతయ్య, మహబూబ్‌ పాష, శ్రీను, వెంకట య్య తదితరులు పాల్గొన్నారు.

- ఆత్మకూరులో ఏఐటీయూసీ, సీఐటీయు, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మోష, శ్రీహరి, రాజు, రాబర్ట్‌, రాజన్న పాల్గొన్నారు. 

- మదనాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T04:58:27+05:30 IST