సాగుకు సమయం లేదు..

ABN , First Publish Date - 2020-12-03T04:35:11+05:30 IST

రైతులందరూ ముందస్తు దాళ్వాకు సన్నద్ధం కావాలని ఏడీఏ ఎల్‌బీవీ.సత్యనారాయణ సూచించారు.

సాగుకు సమయం లేదు..
ఆచంటలో అవగాహన కల్పిస్తున్న ఏవో

మార్చిలో కాల్వలు మూత

త్వరితగతిన నాట్లు వేయండి

రైతులకు అధికారుల సూచన


ఆచంట/మొగల్తూరు/ఆకివీడు, డిసెంబరు 2: రైతులందరూ ముందస్తు దాళ్వాకు సన్నద్ధం కావాలని ఏడీఏ ఎల్‌బీవీ.సత్యనారాయణ సూచించారు.ముందస్తు సాగుపై వ్యవసాయాధికారులు మైక్‌ద్వారా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఆచంట, ఎ.వేమవరం, కొడమంచిలిలో బుధవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏడీఏ సత్యనారాయణ, ఏవో కె.రాజశేఖర్‌ మాట్లాడుతూ సార్వా కోతలు పూర్తికాగానే దాళ్వా సాగుకు నారుమడు లు వేసుకోవాలన్నారు. దాళ్వాలో నీటి ఎద్దడి ఉంటుంది కాబట్టి నెలాఖరులోపు నాట్లు వేసుకోవాలన్నారు. దాళ్వా సాగుకు ఎంటీయూ 1121 రకం అనుకూలమని, వీటినే రైతులు ఉపయోగించుకోవాలన్నారు. సమావేశంలో  సుంకర సీతారాం, కాండ్రేకుల సత్యనారాయణ, వనమరాజు పలువురు రైతు లు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొగల్తూరు, రామ న్నపాలెం గ్రామాల్లో వ్యవసాయశాఖ ఏడీఏ కెఎఎస్‌ఎస్‌.శ్రీనివాసరావు రైతు లతో సమావేశం నిర్వహించారు. అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని, వ్యవసాయశాఖ సలహాలు, సూచనలతో సాగు చేపట్టాల న్నారు. సమావేశంలో తహసీల్దార్‌ ఎస్‌.కె హుస్సేన్‌, ఏవో ప్రియదర్శిని,  వీఏవోలు హరిక, మౌనిక, రవి, సుధారాణి, ఆనంద్‌బాబు, కావ్య, రాజగోపాల్‌, రైతులు పాల్గొన్నారు. రైతులు ఈ నెల మొదటి వారంలో నారుమడులు పూర్తిచేసుకోవాలని ఆకివీడు ఏవో ఎంఆర్పీ ప్రియాంక సూచించారు. మార్చి 31 నుంచి కాల్వలు మూసివేయనున్నందున త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలన్నారు. ఎంటీయూ 1121 రకం సాగు మంచిదన్నారు.

పాలకొల్లు రూరల్‌ : రబీ సాగులో నెలాఖరుకు నాట్లు వేయాలని ఏడీఏ ఎల్‌బీవీ.సత్యనారాయణ, తహసీల్దార్‌ జి.మమ్మి రైతులకు సూచించారు.  ఏఎంసీ ఆవరణలో మంగళవారం రాత్రి వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ఉద్దరాజు విజయరామరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆర్‌ఐ పి త్రిమూర్తులు, ఏఈవోలు కె.ప్రవీణ్‌, బి.సింధుకుమారి, గ్రామ వ్యవసాయ సహాయకులు, రెవెన్యూ అధికారులు, ఎంపీఈవోలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T04:35:11+05:30 IST