‘రచ్చబండ’కు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-21T05:22:35+05:30 IST

‘రచ్చబండ’కు రంగం సిద్ధం

‘రచ్చబండ’కు రంగం సిద్ధం
అక్కంపేటలో ‘రైతు రచ్చబండ’ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, గండ్ర తదితరులు

 నేడు అక్కంపేటలో శ్రీకారం

 ప్రారంభించనున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

 నిరుపేద దళితుడి గుడిసెలో భోజనం

 రైతులకు ‘వరంగల్‌ డిక్లరేషన్‌’

వివరింపు లక్ష్యంగా..

 స్థానిక నేతలకు బాధ్యతల విభజన

హనుమకొండ సిటీ, మే 20: టీపీసీసీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘రైతు రచ్చబండ’ కార్యక్రమం ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా చే పట్టే రచ్చబండ కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా నుంచే శ్రీకారం చుట్టనుంది. ఆచార్య జయశంకర్‌ జన్మస్థలం అక్కం పేట నుంచి ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రేవంత్‌ రెడ్డి రైతులతో సమావేశం అవుతారు. తరువాత గ్రామ దళితుడు డేవిడ్‌ ఉండే గుడిసెలో అతడి కుటుంబసభ్యులతో కలిసి రేవంత్‌రెడ్డి భోజనం చేస్తారు. రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు కూడా ఇక్కడే భోజనం చేసిన తదుపరి తిరిగి హైదరాబాద్‌ బయలుదేరుతారు. 

నేతలకు బాధ్యతల విభజన

‘రైతు రచ్చబండ’ నిర్వహణకు జిల్లా నేతలకు బాధ్యతల విభజన జరిగింది. మండల అధ్యక్షులతో పాటు రెండు మం డలాలకు ఇన్‌చార్జిగా ముఖ్య నేతలు నియమితులయ్యారు. నెలరోజులపాటు జరిగే రచ్చబండ నిర్వహణ నివేదికను ప్రతీరోజు ఇన్‌చార్జిలు టీపీసీసీకి అందచేసేలా ప్రణాళికలు రూపొందించారు. రచ్చబండ నిర్వహణకు పది రోజుల ముందు నుంచే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నేతలు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ బిజీ అయ్యారు. 

నేతల పనితీరుపై నిఘా

‘రైతు రచ్చబండ’ నిర్వహణ, విజయవంతం అంశాలను టీపీసీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పకడ్బందీ ప్రణాళికలతో కార్యక్రమాన్ని సిద్ధం చే శారు. గ్రామ గ్రామాన రచ్చబండ నిర్వహణ తీరుపై ప్రత్యేక బృందాలతో రేవంత్‌రెడ్డి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వీడి యోకాల్‌తో రచ్చబండ నిర్వహణ, అక్కడి నేతలు పాల్గొనడం తదితర వాటిని రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నట్లు తెలిసింది. పని చేయని నేతలపై కఠిన చర్యలు తీసుకోవడం, కమిటీ ఏర్పాటు క్రమంలో వారిని పక్కన పెట్టడం వంటి నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. 

నేతల్లో జోష్‌

ఈనెల 6న హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాలలో ఏఐసీసీ ఉ పాధ్యక్షుడు రాహుల్‌గాంఽధీ ముఖ్య అతిథిగా హాజరైన ‘రైతు సంఘర్షణ సభ’ విజయవంతం కావడంతో వరంగల్‌ ఉమ్మడి జిల్లా పార్టీ వర్గాల్లో జోష్‌ నెలకొంది. ఈ సభలో ‘వరంగల్‌ డి క్లరేషన్‌’ను కాంగ్రెస్‌ ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే రైతులకు కాంగ్రెస్‌ జరిపే సంక్షేమాన్ని వెల్లడి పరి చింది. రూ.2లక్షల రుణ మాఫీ, పంటలకు గిట్టుబాటు ధరల కల్పన తదితర రైతు సంక్షేమ నిర్ణయాలను ప్రకటించింది. ఈ నిర్ణయాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లడం, రైతులకు క్షు ణ్ణంగా వివరించడం లక్ష్యంగా కాంగ్రెస్‌ ‘రైతు రచ్చబండ’ను నిర్వహిస్తోంది. రైతు సంఘర్షణ సభ జోష్‌ను రచ్చబండతో కొనసాగిస్తూ పార్టీకి పూర్వ వైభవం తేవాలనే లక్ష్యంతో కాం గ్రెస్‌ నేతలు కదులుతున్నారు. రానున్న ఎన్నికలకు ముందే పార్టీని పటిష్ఠం చేయాలనే వ్యూహంతో కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. 

Updated Date - 2022-05-21T05:22:35+05:30 IST