10 ఎకరాల మొక్కజొన్న, 7 ఎకరాల వరి కుప్ప దగ్ధం

ABN , First Publish Date - 2021-04-18T05:42:50+05:30 IST

మండలంలోని రాచూరు పంచాయతీ పరిధిలో శనివారం 10 ఎకరాల మొక్కజొన్న, 7 ఎకరాల్లో వరి కుప్పలు దగ్ధమయ్యాయి.

10 ఎకరాల మొక్కజొన్న, 7 ఎకరాల వరి కుప్ప దగ్ధం
దగ్ధమౌతున్న వరికుప్పను చూపుతున్న రైతు

భట్టిప్రోలు, ఏప్రిల్‌ 17: మండలంలోని రాచూరు పంచాయతీ పరిధిలో శనివారం 10 ఎకరాల మొక్కజొన్న, 7 ఎకరాల్లో వరి కుప్పలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన లక్ష్మణరావుకు చెందిన రెండున్నర ఎకరాల వరి, మొక్కజొన్న, కొల్లూరు గోపయ్యకు చెందిన రెండు ఎకరాల వరి, మొక్కజొన్న, శ్రీనివాసరావుకు చెందిన రెండు ఎకరాల్లో వరి, మొక్కజొన్న, దావీదుకు చెందిన ఎకరం వరి, మొక్కజొన్న, మురళికృష్ణకు చెందిన ఎకరంన్నర మొక్కజొన్న, నాగరాజుకు చెందిన ఎకరం మొక్కజొన్న పంటలు అగ్ని ప్రమాదంలో బూడిదగా మారాయి. సుమారు 8 లక్షల పంట కాలి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. పంటలు ఆగ్నికి ఆహుతి కావడంతో అప్పులు ఎలా తీర్చాలని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. 


Updated Date - 2021-04-18T05:42:50+05:30 IST