'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ వచ్చేసింది.

Jul 30 2021 @ 09:46AM

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరి 'రాధే శ్యామ్'. కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా దేశమంతా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. 1960ల నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పూజా కనిపించనున్నారు. 2018లోనే అధికారికంగా ప్రకటించిన 'రాధే శ్యామ్' అనేక కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత, కరోనా ప్రభావం పడటంతో షూటింగ్ డిలే అయింది. అయితే ఇటీవలే హైదరాబాద్‌లో బ్యాలెన్స్ షూటింగ్ తిరిగి ప్రారంభించిన మేకర్స్ ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేశారు. 

ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వనున్నట్టు వెల్లడించిన 'రాధే శ్యామ్' బృందం అన్నట్టుగానే ట్విట్టర్ వేదికగా ఈ చిత్రాన్ని 2022 జనవరి 14న మకర సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేసి అధికారకంగా ప్రకటించారు. ఇప్పటికే 2022 సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ - రానా మల్టీస్టారర్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట దిగబోతున్నట్టు ప్రకటించగా ఇప్పుడు ప్రభాస్ కూడా తన చిత్రం 'రాధే శ్యామ్'ని దింపుత్న్నట్టు ప్రకటించాడు. ఈ విధంగా చూస్తే 2022 సంక్రాతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోవడం ఖాయం.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.