Advertisement

'రాధేశ్యామ్‌' విడుదల.. వెనక్కి వెళుతుందా?

Jan 24 2021 @ 10:18AM

రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ లేటెస్ట్‌ ప్యాన్‌ ఇండియా మూవీ 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాది సమ్మర్‌లో 'రాధేశ్యామ్‌'ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా విడుదల సమ్మర్‌లో ఉండకపోవచ్చునని అంటున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను త్వరత్వరగా పూర్తి చేసేయాలని కాకుండా, మంచి ఔట్‌పుట్‌తో సినిమా చేయాలనేది ఓ కారణం, అలాగే ప్యాన్‌ ఇండియా మూవీ కాబట్టి రిలీజ్‌ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ఉండాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకోసమని సినిమాను సమ్మర్‌లో కాకుండా ఈ ఏడాది జూలై 12న చేయాలని అనుకుంటన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి 'రాధేశ్యామ్‌' విడుదలపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్‌ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.