నేను ఓ కప్పను: రాధికా ఆప్టే ఫొటో వైరల్

Jul 29 2021 @ 17:00PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ - దర్శకుడు పా.రంజిత్‌ కాంబిన్‌లో వచ్చిన ‘కబాలి’ చిత్రంలో రజనీ భార్యగా నటించిన హీరోయిన్‌ రాధికా ఆప్టే తాజాగా సోషల్‌ మీడియాలో గ్లామరస్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. నిజానికి ఈమె కోలీవుడ్‌కు 2012లో వచ్చిన ‘ధోనీ’ చిత్రం ద్వారా పరిచయమైంది. కానీ, 2016లో వచ్చిన ‘కబాలి’ చిత్రం ద్వారా తమిళ సినీ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంది. ఇప్పుడీమె సోషల్‌ మీడియాలో ఎల్లలులేని గ్లామరస్‌ ఫొటోలను పోస్టు చేస్తూ మంచి పబ్లిసిటీని దక్కించుకుంటూ ఉంది. 


ఈ క్రమంలో తాజాగా ఈ భామ కప్పలా కూర్చొని, అదికూడా టూపీస్‌ దుస్తులు ధరించి దిగిన ఫొటోలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఒక పార్కులో చెత్త వేసేందుకుగాను కప్ప ఆకారంతో తయారు చేసిన డస్ట్‌బిన్‌ను పెట్టారు. ఈ పార్కుకు వెళ్ళిన ఈ బాలీవుడ్‌ భామ... ఆ డస్ట్‌బిన్‌ పక్కన కూర్చొని అచ్చం కప్పలాగే కూర్చొని ఫొటోలు దిగి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది.  ఆ ఫొటోల కింద ‘ప్రతి ఒక్కరూ జంతువే. నేను ఇప్పుడు కప్పలా ఉన్నాను. మీరు ఏ జంతువు?’ అంటూ ఓ కామెంట్‌ను పోస్టు చేసింది.


Follow Us on:

Otherwoodsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.