వంటలు

ముల్లంగి, గోబి కూర

ముల్లంగి, గోబి కూర

కావలసిన పదార్థాలు: గోబి - మూడు కప్పులు, ముల్లంగి ముక్కలు- కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, వెల్లుల్లి ముక్కలు- స్పూను, మిరియాల పొడి- అర స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు - తగినంత.


తయారు చేసే విధానం: ముందుగా గోబి, ముల్లంగి ముక్కల్ని ఉడికించి, నీటిని వడకట్టాలి. ఓ పాన్‌లో నూనె వేసి ఉల్లి ముక్కల్ని వేయించాలి. వెల్లులిని కలపాలి. ఆ తరవాత గోబి, ముల్లంగి ముక్కల్నీ జతచేయాలి. దీంట్లో మిరియాల పొడి, ఉప్పు వేసి అయిదు నిమిషాలు ఉడికిస్తే సరి. పైన కొత్తిమీర తరుగును చల్లాలి.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.