రదుకాను ఇంటికి..
ABN , First Publish Date - 2022-05-26T10:36:45+05:30 IST
యూఎస్ ఓపెన్ విజేత ఎమ్మా రదుకాను రెండో రౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టగా..
పారిస్: యూఎస్ ఓపెన్ విజేత ఎమ్మా రదుకాను రెండో రౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టగా.. టాప్ సీడ్ జొకో విచ్, జ్వెరెవ్, కెర్బర్, అజరెంకా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 12వ సీడ్ రదుకాను (బ్రిటన్) 6-3, 1-6, 1-6తో సస్నోవిచ్ (బెలారస్) చేతిలో, 4వ సీడ్ మరియా సక్కారి (గ్రీస్) 6-7(5), 6-7(4)తో కరోలినా ముచోవా చేతిలో ఓడారు. కాగా, జర్మన్ స్టార్ కెర్బర్ 6-1, 7-6(2)తో జాక్వెమోట్ (ఫ్రాన్స్)పై, అజరెంకా 6-1, 7-6(3)తో పెట్కోవిచ్ (జర్మనీ)పై, కొకొ గాఫ్ (అమెరికా) 6-1, 7-6(4)తో ఉట్వాంక్ (బెలార్‌స)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో సెర్బియా ఆటగాడు జొకోవిచ్ 6-2, 6-3, 7-6(4)తో మోల్కన్ (స్లొవేకియా)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 2-6, 4-6, 6-1, 6-2, 7-5తో సెబాస్టియన్ బేజ్‌ను ఓడించారు. కాగా, ఫ్రాన్స్ ఆటగాడు జొ విల్ఫ్రెడ్ సొంగా ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. మొదటి రౌండ్లో సొంగా 7-6(6), 6-7(4), 2-6, 6-7(0)తో కాస్పర్ రడ్ (నార్వే) చేతిలో ఓడాడు. డబుల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్-హంటర్ జోడీ రెండో రౌండ్‌కు చేరుకుంది.