దుమ్మురేపిన Rafael Nadal .. కెరీర్‌లో 14వ French Open కైవశం..

ABN , First Publish Date - 2022-06-06T02:52:32+05:30 IST

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్-2022(French Open-2022)ను క్లే కోర్టు రారాజు రఫేల్ నడాల్‌ దక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌లో ప్రత్యర్థి నార్వే ఆటగాడు,

దుమ్మురేపిన Rafael Nadal .. కెరీర్‌లో 14వ French Open కైవశం..

పారిస్‌: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్-2022(French Open-2022)ను క్లే కోర్టు రారాజు రఫేల్ నడాల్‌ దక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌లో  ప్రత్యర్థి నార్వే ఆటగాడు, టోర్నీలో ఎనిమిదో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌‌ను చిత్తుచిత్తుగా మట్టికరిపించాడు. అంచనాలకు తగ్గట్టు రాణించి వరుస సెట్లలో తిరుగులేని ఆధిక్యంతో చరిత్రాత్మక విజయం అందుకున్నాడు. పవర్‌ఫుల్ సర్వీసులు, షాట్లతో వరుస సెట్లను గెలుచుకున్నాడు. తొలి రెండు సెట్లు 6-3, 6-3 తేడాతో దక్కించుకోగా చివరిదైన మూడవ సెట్‌లో మరింత దూకుడు ప్రదర్శించి 6-0 తేడాతో విజయదుందుభీ మోగించాడు. దీంతో రఫేల్ నడాల్ రికార్డ్ స్థాయిలో 14వసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్నట్టయింది. కాగా కెరీర్‌లో అతడి మొత్తం గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ సంఖ్య  22కి పెరిగింది.  


మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి నార్వే ఆటగాడిగా రూడ్ ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 23 ఏళ్ల రూడ్‌ ఏ మేజర్‌ టోర్నీలోనూ నాలుగో రౌండ్‌ దాటలేకపోయాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఏకంగా తుది పోరులో 36 ఏళ్ల దిగ్గజం నడాల్‌ను ఢీకొట్టి అందరిచేతా శభాష్ అనిపించుకున్నాడు.

Updated Date - 2022-06-06T02:52:32+05:30 IST