కేఎస్‌ దర్శకత్వంలో Raghava Lawrence కొత్త చిత్రం

Published: Mon, 27 Jun 2022 13:42:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కేఎస్‌ దర్శకత్వంలో Raghava Lawrence కొత్త చిత్రం

దక్షిణాదిన డ్యాన్స్ కొరియో గ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence).. ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. బిగినింగ్ లో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అతడికి సరైన గుర్తింపు రాలేదు. అయితే ‘ముని’ (Muni) హారర్ సిరీస్ తో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా మెప్పించాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకూ మొత్తం నాలుగు చిత్రాలు తెరకెక్కగా అన్ని సూపర్ సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం లారెన్స్ హీరోగా పలు చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడు హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది.  


ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కేఎస్ రవికుమార్‌ (KS Ravikumar) చాలా గ్యాప్‌ తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇందులో రాఘవ లారెన్స్‌ హీరోగాను, ఆయన తమ్ముడు ఎల్విన్‌ (Elvin) ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు తాజాగా నగరంలో జరిగాయి. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌, ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా, రాఘవ లారెన్స్‌ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘చంద్రముఖి-2’ (Chandramukhi 2), ‘అధికారం’ (Adhikaram), ‘రుద్రన్‌’ (Rudran) లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘రుద్రన్‌’ క్రిస్మ్‌స్‌కు విడుదల చేసేలా ప్లాన్‌ చేశారు. మరి ఈ సినమా రాఘవ లారెన్స్ కు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International