మరో ఏడాదిన్నరలోగా TDP అధికారంలోకి వస్తుంది: Raghavendra Rao

Published: Mon, 27 Jun 2022 14:33:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మరో ఏడాదిన్నరలోగా TDP అధికారంలోకి వస్తుంది: Raghavendra Rao

బాపట్ల (Bapatla) జిల్లా: ప్రముఖ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిన్నరలోగా టీడీపీ (TDP) అధికారంలోకి వస్తుందని అన్నారు. బాపట్ల జిల్లా, చుండూరు మండలం, నడిగడ్డపాలెంలో ఎన్టీఆర్ విగ్రాహాన్ని (NTR statue) ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నేతలు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని పిలుపిచ్చారు. రోజు రోజుకూ ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, స్థానిక నేతలు పాల్గొన్నారు. భారీగా హాజరైన కార్యకర్తలు.. దిండుపాలెం నుంచి నడిగడ్డపాలెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.