వాల్తేర్ క్లబ్‌పై ఏ2 కన్ను పడింది: రఘురామకృష్ణంరాజు

ABN , First Publish Date - 2021-08-24T22:08:55+05:30 IST

విశాఖ వాల్తేర్ క్లబ్‌పై ఏ2 కన్ను పడిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

వాల్తేర్ క్లబ్‌పై ఏ2 కన్ను పడింది: రఘురామకృష్ణంరాజు

న్యూఢిల్లీ: విశాఖ వాల్తేర్ క్లబ్‌పై ఏ2 (విజయసాయిరెడ్డి) కన్ను పడిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్లబ్‌కు ఉన్న16 ఎకరాల భూమిలో 10 ఎకరాలను ఇవ్వాలని ఏ2 అడుగుతున్నారన్నారు. అసలు విశాఖపట్నానికి విజయసాయికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆయనొక రాజ్యసభ సభ్యుడని అన్నారు.


ఏపీ రాజధానిగా నూటికి నూరు శాతం అమరావతి ఉంటుందని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి అంశంపై హైకోర్టులో స్టే ఉన్నప్పుడు రాజధాని ఎలా మారుస్తారని ప్రశ్నించారు. న్యాయ దేవతను నమ్ముకున్న మహిళలు, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. మంత్రి బొత్స, జగన్ కలలు కలలుగానే మిగిలిపోతాయన్నారు. ఈడీ కేసులను విచారిస్తామని సీబీఐ, హైకోర్టు చెప్పిందని, దీనిపై విజయసాయి సుప్రీంకు వెళ్తామని అంటున్నారని.. ఇంకా సుప్రీంలో పిటిషన్ వేయలేదని రఘురామ అన్నారు.

Updated Date - 2021-08-24T22:08:55+05:30 IST