Delhi: ఎవరెవరికి సూట్ కేసులు పంపిస్తున్నారో అన్ని వివరాలు ఉన్నాయి: Raghurama

ABN , First Publish Date - 2022-07-12T21:29:56+05:30 IST

ఈ మధ్య శాశ్వత అధ్యక్షుడి గొడవ ఎక్కువైందని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రఘురామ వ్యాఖ్యలు చేశారు.

Delhi: ఎవరెవరికి సూట్ కేసులు పంపిస్తున్నారో అన్ని వివరాలు ఉన్నాయి: Raghurama

న్యూఢిల్లీ (Delhi): ఈ మధ్య శాశ్వత అధ్యక్షుడి గొడవ ఎక్కువైందని జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy)ని ఉద్దేశించి ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama krishnamraju) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై కేంద్ర ఎన్నికల అధికారిని కూడా కలిశానన్నారు. అయితే వైసీపీ ప్లినరీ (YCP Plenary) తీర్మానం ఇంకా ఎన్నికల కమిషన్ (EC) వద్దకు రాలేదని, సమాచారం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారి చెప్పారన్నారు. సూట్ కేసులు (Suit cases) పట్టుకొని మోసేవాడు, దొంగ కంపెనీలు నడిపేవాడు  జాతీయ కార్యదర్శి ఏంటని ప్రశ్నించారు. ఎవరెవరికి సూట్ కేసులు పంపిస్తున్నారో అన్ని వివరాలు ఉన్నాయని, అందరిని సూట్ కేసులతో కొట్టాలని అనుకోవద్దని, ఇక సూట్ కేసులు దందాలు మానేయాలని రఘురామ సూచించారు.


శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధి ఉన్నారని సాయిరెడ్డి అంటున్నారని, అయితే సాయిరెడ్డి ఇక్కడొక విషయం తెలుసుకోవాలని రఘురామ అన్నారు. డీఎంకే పార్టీ అధ్యక్ష పదవికి ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగి కరుణానిధి శాశ్వత అధ్యక్షుడు పదవిలో కొనసాగారని, ఈ విషయమై డీఎంకే నేతలతో కూడా మాట్లాడానని, డీఎంకే అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని వాళ్లు స్పష్టంగా చెప్పారన్నారు. ఎన్నికలు లేకుండా శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధి లేరని, ఉన్నారని అంటున్న సాయిరెడ్డి నిరూపించాలన్నారు. నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని రఘురామ సవాల్ విసిరారు.


సృష్టిలో అతి విలువైనది తల్లి అని, డబ్బులు వస్తాయి పోతాయని, తృణప్రాయమైన ఆస్తిని తన వద్ద ఉంచుకొని విలువైన తల్లిని చెల్లికి ఇచ్చారని రఘురామ అన్నారు. సీఎం ఏం చదివారో.. ఎక్కడ చదివారో తెలియదన్నారు. బైజ్యూస్ ట్యాబ్స్ ఇస్తామని అంటున్నారు... కొన్ని వెలమందిని ఉద్యోగం నుంచి తీసేశారని తెలిసిందన్నారు. రాష్ట్రంలో పిచ్చి బ్రాండ్స్ తీసుకొచ్చి అమ్మేస్తున్నారని, జలగలాగ జనాలను పిక్కు తింటున్నారని మండిపడ్డారు. అడిగిన మద్యం ఇవ్వడం లేదన్నారు. అసలు డిస్లరీలు నడపుతున్న వారు ఎవరు? మద్యం ఎవరు సప్లై చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం విధానంలో డబ్బులు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు?.. డిజిటిల్ విధానం ఎందుకు పాటించడం లేదు?.. దీనిపై ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Updated Date - 2022-07-12T21:29:56+05:30 IST