Liquor ban: మద్యం నిషేధిస్తామని గతంలో జగన్ ప్రకటించారు: రఘురామ

ABN , First Publish Date - 2022-08-01T21:12:21+05:30 IST

వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో మద్యం నిషేధిస్తామని గతంలో జగన్ ప్రకటించారని రఘురామ అన్నారు.

Liquor ban: మద్యం నిషేధిస్తామని గతంలో జగన్ ప్రకటించారు: రఘురామ

ఢిల్లీ (Delhi): వైసీపీ (YCP) అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (AP)లో దశలవారీగా మద్యం (Liquor) నిషేధిస్తామని (ban) గతంలో ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) ప్రకటించారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama krishnamraju) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యనిషేధం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మద్య నిషేధం చేస్తామని రోజా (Roja) కూడా అసెంబ్లీ (Assembly)లో అన్నారని.. ఇప్పుడు ఏమైందని ఆయన నిలదీశారు. మాట తప్పం, మడమ తిప్పమన్న వైసీపీ పార్టీకి తుప్పు పట్టేలా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తారో చూడాలని అన్నారు. రాజధానిని ఎవరూ ఆపలేరంటున్న ఏ2 విజయసాయిరెడ్డి (Vijayasai) కోర్టుల కంటే గొప్పవారా? అని ప్రశ్నించారు. రుషికొండ (Rushikonda) నిర్మాణాలు జరిగే ప్రాంతానికి వెళ్తే కేసులు పెడుతున్నారని, దేశ చరిత్రలో టూరిజం డిపార్ట్‌మెంట్ ఇంత పెద్ద నిర్మాణాలు కట్టలేదన్నారు. ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వం ఇంకా ఎన్ని కథలు చెప్తుందో చూడాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Updated Date - 2022-08-01T21:12:21+05:30 IST