Raghurama: సీఐడీ అధికారులు హైకోర్టు తీర్పును ఉల్లంఘించారు: రఘురామ

ABN , First Publish Date - 2022-09-20T21:17:28+05:30 IST

సీఐడీ అధికారులు హైకోర్టు తీర్పును ఉల్లంఘించారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Raghurama: సీఐడీ అధికారులు హైకోర్టు తీర్పును ఉల్లంఘించారు: రఘురామ

ఢిల్లీ (Delhi): సీఐడీ విచారణకు తాను రాలేదని డీఐజీ సునీల్ కుమార్ (DIG Sunil Kumar) స్టేట్‌మెంట్ ఇచ్చారని, సీఐడీ (CID) అధికారులు హైకోర్టు (High Court)తీర్పును ఉల్లంఘించారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama krishnamraju) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టులో తన తరఫు న్యాయవాది స్పష్టంగా చెప్పారని, తనను కట్టేసి కొట్టారని....వర్చువల్‌గా విచారణ జరపాలని కోర్టు గతంలో చెప్పిందన్నారు. కోర్టులో తాను వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందన్నారు.


ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) కట్టుకధలు చెప్తున్నారని, ఆరు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇప్పుడు నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని రఘురామ అన్నారు. సర్వేలన్నీ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, 30, 40 సీట్లు మాత్రమే వచ్చేలా ఉన్నాయన్నారు. సభలో విపక్షాలు ఆందోళన చేస్తే గెంటేయడానికి మంచి స్పీకర్ ఉన్నారని, సీఎం జగన్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అని కొందరిని అడిగానని.. పిట్టలదొర (ముఖ్యమంత్రి) మాటలు ఎవరు నమ్ముతారని అంటున్నారనన్నారు. పోలీసులు, టీచర్ల నియామకాలు లేవని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచి ఒక్కరిని కూడా పర్మినెంట్ చేయలేదని ఆరోపించారు. కీయా పరిశ్రమ, అపోలో టైర్స్ చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినవేనన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పరిశ్రమలు తరలిపోయాయని ఎద్దేవా చేశారు.


2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడున్నర  ఏళ్ల నుంచి ఫైనాన్స్ కమిషన్ లేదని రఘురామ విమర్శించారు. రాజధానిపై సీఎం జగన్ గతంలో చిలకపలుకులు పలికారని, రాజధానిలో ఇల్లు కట్టుకున్నాని అన్నారని, హైదరాబాద్‌ను మించిన రాజధాని నిర్మిస్తామని గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

Updated Date - 2022-09-20T21:17:28+05:30 IST