అప్పులో అగ్రస్థానంలో ఏపీ..అప్పుల కోసం అనేక తప్పులు: రాఘురామ

ABN , First Publish Date - 2021-09-30T20:41:24+05:30 IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థానంలో నిలిపారని, అప్పుల కోసం ప్రభుత్వం అనేక తప్పులు ...

అప్పులో అగ్రస్థానంలో ఏపీ..అప్పుల కోసం అనేక తప్పులు: రాఘురామ

న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థానంలో నిలిపారని, అప్పుల కోసం ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఎం పోషణకు జగన్ గోరుముద్ద  అని పేరు పెట్టుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మార్జిన్ మనీ పెడితేనే కేంద్రం ఇచ్చే నిదులు ఖర్చు అవుతాయని, ఏపీ ముందే మార్జిన్ మనీ పెట్టాలని అనడంతో ఎస్‌బీఐకి ఒక లేఖ రాశారని, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రం ఉంచవలసిన మార్జిన్ మనీ విషయంలో కూడా దగా, మోసం పద్దతులను ప్రభుత్వం అవలంబిస్తోందన్నారు.


ప్రభుత్వానికి ఇవ్వకపోతే స్వాధీనం చేసుకుంటామని ఏయిడెడ్ పాఠశాల జీవోలో స్పష్టంగా ఉందని రఘురామ అన్నారు. అబద్దాలతో కోర్టులను కూడా అధికారులు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులు విషయంలో కూడా కోర్టులో పచ్చి అభద్దలు ఆడారని, విద్యను స్థల దాహం కోసం వాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల పాలైన పర్వా లేదు.. మాదక ద్రవ్యాలతో యువత నాశనం అవుతున్న అక్కరలేదు.. కానీ సినిమాలు, టిక్కెట్లు, దూషణలు, బహుబలి టికెట్స్‌పై దర్యాఫ్తు అంటున్న వారు ఏన్నో ఏళ్ళ నుంచి ఏ1, ఏ2లపై ఉన్న కేసుల సంగతి ఏంటని రఘురామ ప్రశ్నించారు. టీటీడీలో భజనలు చేయనివ్వడం లేదనే వార్తలు వస్తున్నాయని, టీటీడీ వసతి గృహాల్లో, రూముల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని రఘురామ అన్నారు. 

Updated Date - 2021-09-30T20:41:24+05:30 IST