ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదు: రఘురామ

ABN , First Publish Date - 2021-10-06T20:41:14+05:30 IST

నరేగా నిధులపై హైకోర్టు తీర్పు హర్షనీయమని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదు: రఘురామ

న్యూఢిల్లీ: నరేగా నిధులపై హైకోర్టు తీర్పు హర్షనీయమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదన్నారు. అందరికీ నరేగా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెండర్లకు ప్రభుత్వం పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో ఎక్కడ టెండర్లు వేసినా.. తెలుగువారుంటారన్నారు. కానీ ఏపీలో టెండర్లు వేస్తే ఎవరూ ముందుకు రావడం లేదని రఘురామ అన్నారు. రంజాన్ పండుగకు తోఫాలు, క్రిస్టమస్‌కు కానుకలు ఇస్తారని.. మరీ హిందువుల పండుగలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అమరావతిని పాఠ్యాంశం నుంచి తీసేయడం దారుణమన్నారు. అసలు అమరావతి పాఠ్యాంశం ఎందుకు తీసేయాల్సి వచ్చిందని రఘురామ ప్రశ్నించారు.

Updated Date - 2021-10-06T20:41:14+05:30 IST