జగన్‌రెడ్డితో ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నా: రఘురామ

ABN , First Publish Date - 2022-01-13T02:54:09+05:30 IST

తాను జగన్‌రెడ్డితో ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నానని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు కృష్ణం రాజు అన్నారు. ఏపీ సీఐడీ అధికారులు నోటీసులిచ్చిన ..

జగన్‌రెడ్డితో ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నా: రఘురామ

హైదరాబాద్/అమరావతి: తాను జగన్‌రెడ్డితో ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నానని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు కృష్ణం రాజు అన్నారు. ఏపీ సీఐడీ అధికారులు నోటీసులిచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 లేదా 17న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని చెప్పారు. 8 నెలల తర్వాత నోటీసులివ్వడం.. అది పండుగ పూట ఇవ్వడం సీఐడీ స్వభావాన్ని తెలియజేస్తోందన్నారు. తనను అరెస్ట్‌ చేసిన తీరుపై విచారించాలని కోరారని చెప్పారు. పిటిషన్‌ విత్‌డ్రా చేసుకోవాలంటూ తనను కొట్టారని, తనపై దాడి చేయడం ఉన్మాద చర్య కాదా?అని రఘురామ ప్రశ్నించారు.


‘దాడిపై ప్రశ్నిస్తే నాపై సాక్షిలో దుష్ప్రచారం చేశారు. నాపై దాడి చేస్తే ప్రశ్నించే హక్కు నాకు లేదా?. అనర్హత వేటు వేస్తామంటూ మాటిమాటికి అనడం కాదు. ఫిబ్రవరి 5 వరకు సమయం ఇస్తున్నా దమ్ముంటే అనర్హత వేటు వేయాలి. నేను రాజీనామా చేయడం మా ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే నాపై ఇలాంటి నిందలు వేస్తున్నారు. నాకు ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా నాకు మద్దతు ఉంటుందని నమ్మకం.’’ అని రఘురామ ధీమా వ్యక్తం చేశారు. 



Updated Date - 2022-01-13T02:54:09+05:30 IST