
ప్రస్తుతం సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా పోస్టులు పెడుతున్నారు. తమకు సంబంధించిన, తమకు నచ్చిన ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. వేరెవరో ఎడిట్ చేసిన వీడియోను రెహ్మాన్ అభిమానులతో పంచుకున్నారు. చాలా బాగుందని ప్రశంసించారు. ఫన్నీగా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.