మోదీ గుప్పిట్లో అన్నాడీఎంకే సర్కారు: రాహుల్‌

ABN , First Publish Date - 2021-03-02T07:24:58+05:30 IST

సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లతో అవినీతి కేసులను తిరగదోడిస్తానంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని ప్రధాని మోదీ బెదిరించి, అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని కాంగ్రెస్‌ నేత

మోదీ గుప్పిట్లో అన్నాడీఎంకే సర్కారు: రాహుల్‌

చెన్నై, మార్చి 1(ఆంధ్రజ్యోతి): సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లతో అవినీతి కేసులను తిరగదోడిస్తానంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని ప్రధాని మోదీ బెదిరించి, అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న రాహుల్‌గాంధీ సోమవారం నాగర్‌కోయిల్‌, కన్నియకుమారిల్లో రోడ్‌ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర అనే సిద్ధాంతాలను బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న దుష్టశక్తులను నిరోధించడంలో తమిళులు దేశానికే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. నీట్‌ పరీక్షలు అనవసరమన్నదే తన వ్యక్తిగత అభిప్రాయమని కన్నియకుమారిలోని సెయింట్‌ జోసెఫ్‌ మెట్రిక్యులేషన్‌ పాఠశాలలో విద్యార్థుల ప్రశ్నకు రాహుల్‌ సమాధానమిచ్చారు. విద్యార్థుల కోరిక మేరకు రాహుల్‌ ఓ ఆంగ్ల గీతానికి నృత్యం చేశారు. తనతో పోటీగా పు్‌షఅప్స్‌ తీయాలని ఓ విద్యార్థిని సవాలు చేయగా, ఆమెకంటే వేగంగా రాహుల్‌ బస్కీలు తీశారు.  

Updated Date - 2021-03-02T07:24:58+05:30 IST