మోదీజీ..ఇకనైనా మంత్రిని తొలగించండి: రాహుల్

ABN , First Publish Date - 2022-01-04T01:49:47+05:30 IST

లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో నిందితుడిని కాపాడేందుకు నరేంద్ర..

మోదీజీ..ఇకనైనా మంత్రిని తొలగించండి: రాహుల్

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో నిందితుడిని కాపాడేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారంనాడు ఆరోపించారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను ఇప్పటికైనా తొలగించాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఘటనలో అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సిట్ సోమవారంనాడు ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో రాహుల్ తాజా డిమాండ్ చేశారు. సిట్ తన ఛార్జిషీటులో 14 మంది పేర్లు చేర్చింది. వీరిలో 13 మంది ఇప్పటికే అరెస్టయ్యారు.


''వీడియా రూపంలో సిట్ 5,000 పేజీల ఛార్జిషీటును యావత్ దేశ ప్రజలు చూశారు. ఇంత జరిగినా నిందితుడిని కాపాండేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది'' అని రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తొలగించండి అంటు ట్వీట్‌కు య్యాష్‌ట్యాగ్‌ ఇచ్చారు.


రైతు వ్యతిరేకతను కప్పిపుచ్చుకోలేరు: ప్రియాంక

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శాతం మోదీ‌పై విమర్శలు గుప్పించారు. 'తప్పుడు క్షమాపణలు', రైతు చట్టాల రద్దుతో రైతు వ్యతిరేక ఆలోచనా దృక్పథాన్ని మోదీ కప్పిపుచ్చుకోలేరని అన్నారు. ''వాళ్లు రక్షించే స్థానంలో ఉన్నారు. కానీ విధ్వంసకులకు బాసటగా నిలుస్తున్నారు. రైతులపై వాహనాలు ఎక్కించి చంపిన లఖింపూర్ ఖేరి హింసాకాండలో హోం శాఖ సహాయ మంత్రి కుమారుడే ప్రధాన నిందితుడని సిట్ ఛార్జిషీటులో పేర్కొంది. నరేంద్ర మోదీ సంరక్షణలో అజయ్ మిశ్రా ఉండటంతో ఇన్వెస్టిగేషన్ స్క్రూటినీ పరిధిలోకి కూడా ఆయన రావడంలేదు. ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారు'' అని ప్రియాంక విమర్శించారు.

Updated Date - 2022-01-04T01:49:47+05:30 IST