తెలంగాణపై రాహుల్ గాంధీకి క్లారిటీ వచ్చిందా?

ABN , First Publish Date - 2021-03-06T20:26:21+05:30 IST

తెలంగాణపై రాహుల్ గాంధీకి క్లారిటీ వచ్చిందా? టీపీసీసీ చీఫ్ ఎవరన్నది ఫిక్స్ అయ్యారా?

తెలంగాణపై రాహుల్ గాంధీకి క్లారిటీ వచ్చిందా?

న్యూఢిల్లీ: తెలంగాణపై రాహుల్ గాంధీకి క్లారిటీ వచ్చిందా? టీపీసీసీ చీఫ్ ఎవరన్నది ఫిక్స్ అయ్యారా? మిగతా నేతలపై అసంతృప్తిగా ఉన్నారా? సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు ఫైట్ చేయడంలేదని గుర్రుగా ఉన్నారా? రాహుల్ ప్లాన్ రాహుల్‌కు ఉందా? అదే ప్లాన్‌తో ముందుకెళుతున్నారా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి శుక్రవారం రాహుల్‌ను కలిశారు. ఆ సమయంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్ తనదైన శైలిలో స్పందించారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పూర్తి స్థాయిలో పనిచేయడంలేదన్న అభిప్రాయాన్ని రాహల్ వ్యక్తం చేసినట్లు సమాచారం.


పార్టీ భవిష్యత్తునే పణంగా పెట్టేలా పనితీరు ఉండొద్దని రాహుల్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మాధుయాష్కి టీపీసీసీ చీఫ్ ప్రస్తావన తెచ్చినప్పుడు రాహుల్ గతంలోకంటే భిన్నంగా స్పందించినట్లు సమాచారం. టీపీసీసీ కూర్పు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని అలా అయితేనే తెలంగాణలో పార్టీ బలపడుతుందని మధుయాష్కి అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంలో తనకు ఒక ప్రణాళిక ఉందని రాహుల్ చెప్పినట్లు తెలియవచ్చింది. 

Updated Date - 2021-03-06T20:26:21+05:30 IST