రాహుల్‌ను 3 గంటలు ప్రశ్నించిన ఈడీ... ప్రశ్నలివే...

ABN , First Publish Date - 2022-06-13T20:34:30+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు..

రాహుల్‌ను 3 గంటలు ప్రశ్నించిన ఈడీ... ప్రశ్నలివే...

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు 3 గంటల సేపు విచారణ సాగింది. రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది. ఈడీ విచారణలో రాహుల్‌పై పలు ప్రశ్నల వర్షం కురిపించింది. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థలో మీ హోదా ఏమిటి? యంగ్ ఇండియన్ సంస్థతో మీ సంబంధం ఏమిటి? మీ  పేరుతో ఆ సంస్థలో షేర్లు ఎందుకు ఉన్నాయి? యంగ్ ఇండియన్ సంస్థకు కాంగ్రెస్ నుంచి రుణాలు ఎందుకు ఇచ్చారని ఈడీ ప్రశ్నించింది.


విచారణ సందర్భగా రాహుల్ గాంధీ తరఫున న్యాయవాదులను అనుమతించ లేదు. సుమారు 3 గంటల సేపు విచారణ సాగిన అనంతరం రాహుల్ లంచ్ కోసం ఈడీ కార్యాలయం విడిచిపెట్టారు. తిరిగి విచారణకు హాజరవుతారు.

Updated Date - 2022-06-13T20:34:30+05:30 IST