లఖింపూర్‌కు వెళ్లనున్న రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-10-06T02:33:14+05:30 IST

ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపడుతోంది. నిరసనలో పాల్గొన్నందుకు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. ప్రియాంక గాంధీని గృహ నిర్భంధం చేయగా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి బూపేష్ భాఘే‌ల్‌ను లఖ్‌నవూ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు..

లఖింపూర్‌కు వెళ్లనున్న రాహుల్ గాంధీ

లఖ్‌నవూ: కారు ప్రమాదంలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయిన లఖింపూర్‌ ప్రాంతానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ బుధవారం వెళ్లనున్నారు. రాహుల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం లఖింపూర‌్‌లోని బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించనుంది. ఆదివారం లఖింపూర్‌లో భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కారును రైతుల నిరసనపై నుంచి పోనివ్వడంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు.


కాగా, ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపడుతోంది. నిరసనలో పాల్గొన్నందుకు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. ప్రియాంక గాంధీని గృహ నిర్భంధం చేయగా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి బూపేష్ భాఘే‌ల్‌ను లఖ్‌నవూ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విషయమై అరెస్ట్‌లు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ నేతలను కూడా నిర్భంధించారు. అయితే బాధిత కుటుంబాలను కలుసుకోవడానికి టీఎంసీ నేతలను అనుమతించిన యోగి ప్రభుత్వం తమను ఎందుకు అనుమతించడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-10-06T02:33:14+05:30 IST