రేపు రాష్ట్రానికి Rahul gandhi

Published: Wed, 30 Mar 2022 11:02:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రేపు రాష్ట్రానికి Rahul gandhi

బెంగళూరు: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ నెల 31న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. రాహుల్‌ పర్యటన వివరాలను కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌ మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఢిల్లీ నుంచి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు దేవనహళ్ళి అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసే రాహుల్‌గాంధీ నేరుగా తుమకూరు జిల్లాలోని సిద్ధగంగమఠానికి చేరుకుంటారని శివకుమారస్వామీజీ 115వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటవుతున్న కార్యక్రమంలో పాల్గొని సమాధికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం బెంగళూరుకు చేరుకునే రాహుల్‌గాంధీ బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని కాం గ్రెస్‌ నేతలతో సమావేశం కానున్నారు. నగరంలోనే రాత్రి బసచేయనున్న ఆయన ఏప్రిల్‌ 1న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గత శాసనసభ ఎన్నికల్లో ఓ టమి పాలైన అభ్యర్ధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తదుపరి కేపీసీసీలోని వివిధ విభాగాల నేతలు, పదాదికారులతోనూ రాహుల్‌ గాంధీ చర్చలు జరుపనున్నారు. కాంగ్రె్‌సలో డిజిటల్‌ సభ్యత్వం తీసుకున్న కొందరు కార్యకర్తలతో ఆయన జూమ్‌ ద్వారా సంభాషించే అవకాశం ఉందని డీకే శివకుమార్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 47 లక్షల మంది డిజిటల్‌ సభ్యత్వాలు పొందారని ఆయన వివరించారు. కాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజల్‌, వంటగ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 31న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాజధాని బెంగళూరుతో సహా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామన్నారు. రాహుల్‌గాంధీ పర్యటన ఉన్నప్పటికీ  ఈ కార్యక్రమంలో వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఎవరూ ప్రయత్నించరాదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 40 శాతం కమీషన్‌ ప్రభుత్వం ఉందని మంత్రి ఈశ్వరప్పపై కాంట్రాక్టర్లు తాజాగా ప్రధానికి చేసిన ఫిర్యాదే ఇందుకు తిరుగులేని ఉదాహరణ అని డీకే శివకుమార్‌ పేర్కొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.