Nightclub లో Rahul Gandhi.. వీడియో వైరల్..

ABN , First Publish Date - 2022-05-03T17:35:28+05:30 IST

ఖాట్మండ్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత Rahul gandhi ఓ పబ్‌లో ఉన్న Video viral గా మారింది.

Nightclub లో  Rahul Gandhi.. వీడియో వైరల్..

ఖాట్మండ్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత Rahul gandhi ఓ పబ్‌లో ఉన్న Video viral గా మారింది. నేపాల్‌ రాజధాని ఖాట్మండులోని ఓ Night club లో రాహుల్ కనిపించారు. ఈ వీడియోని పలువురు బీజేపీ నేతలు Twitter లో షేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో మతఘర్షణలు జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎంచక్కా పార్టీ చేసుకుంటున్నారని విమర్శలు సంధించారు. కష్టాల్లో ఉన్న పార్టీని వదిలి విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని అన్నారు. కాగా నేపాల్‌లోని చైనా అంబాసిడర్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్‌ నేపాల్‌లో ఉన్నట్టు ఖాట్మండు పోస్ట్‌ కథనం కూడా నిర్ధారించింది. వివాహానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్ వెళ్లారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.




బీజేపీ విమర్శల బాణాలు

బీజేపీ ఐటీ కన్వినర్ అమిత్ మాలవీయ స్పందిస్తూ... కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమవుతున్న వేళ రాహుల్ గాంధీ పార్టీలో మునిగిపోయారని విమర్శించారు. ఆయన చాలా స్థిరంగా ఉన్నారని ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరెణ్ రిజుజ్ స్పందిస్తూ.. సెలవులు, పార్టీలు, విహారయాత్రలు, ప్రైవేటు విదేశీ యాత్రలు వంటివి దేశానికి కొత్తమీ కాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో గాంధీ కుటుంబ వారసుడి ప్రవర్తన ఇదేనా అని ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆయన ప్రశ్నించారు.


ఖాట్మండ్ పోస్ట్ ఏం చెబుతోంది

ఖాట్మండ్ పోస్ట్ కథనం ప్రకారం.. రాహుల్ గాంధీ నేపాల్‌లో ఉన్నారు. సోమవారం సాయంత్రం 4:40 నిమిషాలకు విస్తారా విమానంలో ఖాట్మండ్‌ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద ముగ్గురు వ్యక్తులు రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీతోపాటు ఆయన స్నేహితులు నక్సల్‌లోని ఖాట్మండ్ మారియెట్ హోటల్‌లో దిగారు. తన నేపాలి ఫ్రెండ్ సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్ వచ్చారని పేర్కొంది. అయితే వైరల్‌గా మారిన వీడియోకు సంబంధించిన సమాచారమేమీ పేర్కొనలేదు.

Read more