అన్నదాతలు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నారు : రాహుల్

ABN , First Publish Date - 2021-03-06T20:22:36+05:30 IST

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతుల ధర్నా శనివారంతో వంద రోజులకు చేరింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్

అన్నదాతలు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నారు : రాహుల్

న్యూఢిల్లీ : సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతుల ధర్నా శనివారంతో వంద రోజులకు చేరింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భరతమాత ముద్దు బిడ్డలుగా రైతుల కుమారులు దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారని, ప్రభుత్వం మాత్రం ఇక్కడ రైతులను అడ్డుకోడానికి బారికేడ్లను ఏర్పాటు చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. అన్నదాతలు తమ సరైన డిమాండ్ల కోసం పోరాడుతున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందని ట్విట్టర్ వేదికగా రాహుల్ మండిపడ్డారు. 


వందో రోజుకు చేరిన రైతుల నిరసన

కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన శనివారంతో వంద రోజులు అయ్యింది. ఈ సందర్భంగా కుండ్లీ-మనసేర్- పల్‌వాల్ హైవేను వారు దిగ్బంధించారు. ఈ దిగ్బంధం ఉదయం 11 నుంచి 3 గంటల వరకూ కొనసాగుతుందని రైతులు ప్రకటించారు. అయితే దీన్ని తాము ప్రశాంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే ఎమర్జెన్సీ వాహనాలను మాత్రం అనుమతిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జగ్మోహన్ సింగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-06T20:22:36+05:30 IST