గాంధీ కుటుంబానికి భయపడటం తెలియదు: రేణుకాచౌదరి

ABN , First Publish Date - 2022-06-01T22:08:22+05:30 IST

కాంగ్రెస్ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీకి ఈడీ నోటీసుల్లో ఆశ్చర్యం లేదని మాజీ ఎంపీ రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.

గాంధీ కుటుంబానికి భయపడటం తెలియదు: రేణుకాచౌదరి

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీకి ఈడీ నోటీసులు పంపడంలో ఆశ్చర్యం లేదని మాజీ ఎంపీ రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని తప్పుబట్టారు. ఎదిరించేవారికి నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. రాహుల్‌, సోనియాను కేసులు పెట్టి వేధిద్దాం అనుకుంటున్నారని, గాంధీ కుటుంబానికి భయపడటం తెలియదని రేణుకాచౌదరి పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ (National Herald) అవినీతి కేసులో సోనియాకు రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాహుల్ ఈ నెల 2న, సోనియా ఈ నెల 8న తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ సమన్లు పంపింది. అయితే రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని ఈ నెల 5న హాజరయ్యేందుకు అనుమతినవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఈడీని కోరింది.

Updated Date - 2022-06-01T22:08:22+05:30 IST