ఇల్లు కోల్పోయిన బాధితులకు పట్టాలు ఇవ్వాలి: జూలకంటి

ABN , First Publish Date - 2022-07-01T07:11:15+05:30 IST

మట్టపల్లి రెవెన్యూ పరిధి లోని సర్వే నెంబరు 1లో ఇళ్లు కూల్చడం సరికాదని, కూల్చి వేతకు గురైన బాధితులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

ఇల్లు కోల్పోయిన బాధితులకు పట్టాలు ఇవ్వాలి: జూలకంటి
కూల్చిన ఇళ్లను పరిశీలిస్తున్న రంగారెడ్డి

మఠంపల్లి, జూన్‌ 30: మట్టపల్లి రెవెన్యూ పరిధి లోని సర్వే నెంబరు 1లో ఇళ్లు కూల్చడం సరికాదని, కూల్చి వేతకు గురైన బాధితులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మట్టపల్లిలో ఇళ్లు కూల్చివేతతో నిరాశ్ర యులైన బాధితులను పరామర్శించి, సంఘటనా స్థలాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఇళ్లు కూల్చిన వారికి అక్కడే ప్లాట్లు కేటాయించాలన్నారు. వీరంతా మట్టపల్లి గ్రామానికి చెందిన వారేనని, దళిత, గిరిజనులన్నారు. సమాచారం, నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేయడం సరికాదన్నారు. పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు భూక్య పాండునాయక్‌, పల్లె వెంకటరెడ్డి, మండల కార్యదర్శి మాలోతు బాలునాయక్‌, జగన్మోహన్‌రెడ్డి, సయ్యద్‌రన్‌మియా, వాలిభాయి, కె.వెంకన్న, రాము పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T07:11:15+05:30 IST