భార్యాపిల్లలను బంధించి.. కాంట్రాక్టర్‌ను కాల్చి చంపిన దుండగులు

Published: Sat, 25 Jun 2022 19:10:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భార్యాపిల్లలను బంధించి.. కాంట్రాక్టర్‌ను కాల్చి చంపిన దుండగులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో(Lucknow)లో ఈ మధ్యాహ్నం దారుణం జరిగింది. ఓ కాంట్రాక్టర్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు ఆయన భార్యాపిల్లలను బంధించి కాంట్రాక్టర్‌ను కాల్చి చంపారు. లక్నో కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలమఠ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత కాంట్రాక్టర్‌ను బీహార్ వీరేంద్ర ఠాకూర్ (42)గా గుర్తించారు. ఆయనపై ఏకంగా 20కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రైల్వే కాంట్రాక్టే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఈ  ఘటనకు సంబంధించి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సాయుధులైన ముగ్గురు వ్యక్తులు శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కాంట్రాక్టర్ వీరేంద్ర ఠాకూర్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ వెంటనే వీరేంద్ర భార్య కుష్బూ తారా, పిల్లలు అన్ష, రిషిలను బంధించారు. ఆ తర్వాత ఓ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న ఠాకూర్‌ను కాల్చి చంపారు. అనంతరం నిందితులు పారిపోతూ ఇంట్లోని సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఓ రైల్వే కాంట్రాక్ట్ విషయంలో 2019లోనూ వీరేంద్రపై దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.