Viral Video: ఇలాంటి వాళ్లు ఉంటే బుకింగ్ కౌంటర్ల వద్ద చాంతాడంత క్యూ ఎందుకుంటుంది.. ఎన్ని సెకన్లలో టికెట్ ఇచ్చాడంటే..

ABN , First Publish Date - 2022-06-30T23:54:15+05:30 IST

రద్దీ వేళల్లో రైలు టికెట్లు కొనాలంటే బుకింగ్ కౌంటర్ల ముందు చాంతాడంత క్యూ లైన్లో పడిగాపులు కాయాలి.

Viral Video: ఇలాంటి వాళ్లు ఉంటే బుకింగ్ కౌంటర్ల వద్ద చాంతాడంత క్యూ ఎందుకుంటుంది.. ఎన్ని సెకన్లలో టికెట్ ఇచ్చాడంటే..

రద్దీ వేళల్లో రైలు టికెట్లు కొనాలంటే బుకింగ్ కౌంటర్ల ముందు చాంతాడంత క్యూ లైన్లో పడిగాపులు కాయాలి. చాలా స‌మ‌యం క్యూల్లో నిల‌బ‌డి నిలబడి ఉండాలి. ఆ ప‌రిస్థితిని తప్పించేందుకు రైల్వే శాఖ ప‌లు స్టేషన్లలోని ప్లాట్‌ఫాంల‌పై ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్‌ల‌ను (ఏటీవీఎం) ఏర్పాటు చేసింది. బుకింగ్ కౌంటర్ల నుంచే కాకుండా ఈ మెషీన్స్ ద్వారా కూడా రైల్వే శాఖ టికెట్లు విక్రయిస్తుంటుంది. 


ఏటీవీఎం మిషన్ నుంచి అత్యంత వేగంగా టికెట్లు విక్రయిస్తున్న రైల్వే ఉద్యోగికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌్ అవుతోంది. ముంబై రైల్వే ప్రయాణికులు ఈ వీడియోను ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఉద్యోగి కేవ‌లం 15 సెకండ్ల‌లో ముగ్గురు ప్ర‌యాణీకుల‌కు టికెట్లు ఇస్తున్నాడ‌ని కామెంట్ చేశారు.  స్క్రీన్‌పై అత్యంత వేగంగా ట్యాప్ చేస్తూ క్ష‌ణాల్లో ప‌ని పూర్తి చేస్తుండ‌టం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగా 8,80,000 ఈ వీడియోను చూశారు. అద్భుత వేగంతో ఆయ‌న చేస్తున్న ప‌ని వల్ల ఎంతో స‌మ‌యం క‌లిసివ‌స్తోంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-30T23:54:15+05:30 IST