రైల్వే ప్రయాణీకులకు ఆప్తుడు.. 430 మందికి అతను చేసిన సహాయం ఏమిటంటే..

ABN , First Publish Date - 2022-06-14T22:17:16+05:30 IST

చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు తాము చేయాల్సిన పనులనే పూర్తి చేయరు..

రైల్వే ప్రయాణీకులకు ఆప్తుడు.. 430 మందికి అతను చేసిన సహాయం ఏమిటంటే..

చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు తాము చేయాల్సిన పనులనే పూర్తి చేయరు.. అలాంటిది రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తి తనకు సంబంధం లేని పనులను కూడా బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు.. రైల్వేల్లో ప్రయాణించే సమయంలో లగేజీ పోగొట్టుకున్న వారికి అండగా నిలబడుతున్నారు.. వారి సామాను వారికి తిరిగి దక్కేలా చేస్తున్నారు.. అలా ఇప్పటివరకు ఆయన 430 మంది ప్రయాణీకులకు సహాయం చేశారు.. ఆయన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేస్తున్న రాకేష్ శర్మ. 


ఇది కూడా చదవండి..

ఇంగ్లీష్‌లో 35, లెక్కల్లో 36.. వైరల్ అవుతున్న కలెక్టర్ పదో తరగతి మార్కుల లిస్ట్!


రాకేష్ శర్మ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన వ్యక్తి. 24 సంవత్సరాల వయస్సులో రైల్వేలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 2016 ఏప్రిల్‌లో రైలులో లగేజీ పోగొట్టుకున్న ఒక ప్రయాణికుడికి తొలిసారి రాకేష్ సహాయం చేశారు. ఆ తర్వాతి నుంచి ఇప్పటిరవకు 432 మందికి సహాయం చేశారు. ఇందుకోసం రాకేష్ చాలా సమయం వెచ్చిస్తారు. సాధారణంగా రైళ్లలో ఎవరైనా ప్రయాణికులు తమ లగేజీ మర్చిపోతే సిబ్బంది వాటిని స్టేషన్ మాస్టర్‌కు అప్పగిస్తారు. అవి సదరు స్టేషన్‌కు చెందిన లాస్ట్ ప్రాపర్టీ ఆఫీసులో జమవుతాయి. లగేజీ పోయిందని ఎవరైనా ఫిర్యాదు చేసే వరకు అవి అక్కడే ఉంటాయి. అయితే రాకేష్ శర్మ వాటిని ఆఫీసులో జమ చేసి తన దారి తను చూసుకునే మనిషి కాదు. 


ఆ సామాను ఏ భోగీలో, ఏ సీటులో దొరికిందో తెలుసుకుని అందులో ప్రయాణించిన వారి పీఎన్ఆర్ నెంబర్లు తెలుసుకుంటారు. పీఎన్‌ఆర్ నెంబర్ ఆధారంగా పేర్లు తెలుసుకుని సోషల్ మీడియా, ఫోన్ల ద్వారా వారిని కాంటాక్ట్ అవుతారు. పోయిన లగేజీని వచ్చి కలెక్ట్ చేసుకోమని చెబుతుంటారు. తన పరిధిలోకి రాని ఈ పని కూడా చేయడాన్ని రాకేష్ సేవగా భావిస్తారు. ఇతరులకు సేవ చేసేందుకు తనకు దొరికిన ఓ మార్గంగా ఆయన భావిస్తున్నారు. రాకేష్ చిత్తశుద్ధి, నిజాయితీపై రైల్వే సిబ్బంది, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2022-06-14T22:17:16+05:30 IST