రూ.80 లక్షలు వృథా

ABN , First Publish Date - 2021-10-26T05:01:12+05:30 IST

ఒకటి రెండు కాదు.. రూ.80 లక్షల నిధులు వృథా చేశారు. రైలు ఎక్కే ప్రయాణికులు ఇబ్బం దులు పడు తున్నారని హైలెవల్‌ ప్లాట్‌ఫాం నిర్మించారు.

రూ.80 లక్షలు వృథా

నిధులు బూడిదలో పోసిన వైనం 

మందపాడు రైల్వేస్టేషన్‌ శాశ్వతంగా మూత

ఇక్కడ హైలెవల్‌ ప్లాట్‌ఫాం ఎందుకు నిర్మించారో?

గుంటూరు డివిజన్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విమర్శలు


 గుంటూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఒకటి రెండు కాదు.. రూ.80 లక్షల నిధులు వృథా చేశారు. రైలు ఎక్కే ప్రయాణికులు ఇబ్బం దులు పడు తున్నారని హైలెవల్‌ ప్లాట్‌ఫాం నిర్మించారు. నిధులు ఖర్చు అయిన తర్వాత ఏకంగా ఆ రైల్వేస్టేషన్‌నే మూసేశారు. అసలు ఆ రైల్వేస్టేషన్‌ను మూసే యాలి అనుకున్నప్పుడు అక్కడ రూ.80 లక్షలతో పనులు ఎందు కు చేశారో.. తెలియడంలేదు. ఇదంతా గుంటూరు - సత్తెనపల్లి మధ్య ఉన్న మందపాడు లోని రైల్వేస్టేషన్‌ కథ. రైల్వే శాఖ ఈ స్టేషన్‌ను  శా శ్వతంగా మూసేసిన దృష్ట్యా అభివృద్ధి కోసం గుంటూరు డివిజన్‌ వెచ్చిం చిన నిధులు వృథాగా మారాయి. గతంలో మం దపాడు హాల్టింగ్‌ స్టేషన్‌ గా ఉండేది. దానికి ఇటీవలే స్టేషన్‌ భవన నిర్మాణం చేశారు. నడికుడి మార్గంలో విద్యుద్దీకరణ జరిగిన తర్వాత ఇక్కడ హైలెవల్‌ ప్లాట్‌ఫాంని కూడా నిర్మించారు. కొవిడ్‌కి ముందు ప్యాసింజర్‌ రైళ్లకు ఈ స్టేషన్‌లో నిలుపుదల సౌకర్యం కూడా ఉండే ది. అలాంటిది ఆదాయం సరిగా లేదని శాశ్వతంగా మూసేశారు. స్టేషన్‌ని మూసేయాలన్న ప్రతిపాదన ఉన్న ప్పుడు దాదాపుగా పెద్దమొత్తంలో నిధులు వెచ్చించి ఎందుకు హైలెవల్‌ ప్లాట్‌ఫాంని నిర్మించారన్న ప్రశ్నలు ఉత్ప న్నమౌతున్నాయి.


సరైన వివరణను ఇవ్వనందునేనా ?

రైల్వే కొత్త టైంటేబుల్‌ అమలులోకి తీసుకొస్తూ ప్రయాణికుల ఆద రణలేని రైల్వేస్టేషన్లలో నిలుపుదల సౌకర్యాలను ఎత్తివేశారు. వాటితో పాటే గుంటూ రు రైల్వే డివిజన్‌ పరిధిలో కొన్ని స్టేషన్లను శాశ్వతంగా మూసేస్తున్నట్లు రైల్వేబోర్డు ప్రకటించింది. అందులో మందపాడు రైల్వేస్టేషన్‌ ఒకటి. ఈ స్టేషన్‌ని శాశ్వతంగా మూ సేయకుండా ఉండేం దుకు గుంటూరు డివిజన్‌ అధికారులు సరైన వివరణను రైల్వే శాఖకి ఇవ్వలేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కార ణంగా రైల్వే వినియోగ దా రుల సంఘాల నాయకులు చెబుతున్నారు.  కోల్‌కత్తా - చెన్నై రైలుమార్గంలో ఉన్న జిల్లాలోని దుగ్గిరాల రైల్వేస్టేషన్‌ మూసేయకుండా విజయవాడ డివిజన్‌ అధికారులు తగిన విధంగా సమర్ధించడంతో ఆ స్టేషన్‌ని నేటికీ కొనసాగిస్తు న్నారు. నిత్యం ఇక్కడికి ఆదిలాబాద్‌ - తిరు పతి - ఆదిలాబాద్‌ కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ వచ్చి వెళుతుంది. స్టేషన్‌ని మూ సేయకుండా కొనసాగిం చడం వల్ల భవిష్యత్తులో మరికొన్ని రైళ్ల నిలు పుదల కోరేందుకు ఆస్కారం ఉంటుంది. ఒకసారి శాశ్వతంగా మూ సేసిన రైల్వేస్టేషన్‌ని తిరిగి పునరుద్ధరించాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఈ నేపథ్యంలో మందపాడు రైల్వేస్టేషన్‌లో హైలెవల్‌ ప్లాట్‌ఫాం నిర్మాణానికి వెచ్చించిన రూ.80 లక్షలతో పాటు ఆ స్టేషన్‌ భవన నిర్మా ణం కోసం ఖర్చు చేసిన నిధులు కూడా వృథా అయినట్లేనన్న అభి ప్రాయం వ్యక్తమౌతున్నది. స్టేషన్‌కి అనుబంధంగా సిబ్బందికి నిర్మించిన ఇళ్లు కూడా మూతబడ్డాయి. రోజుకు కేవలం రూ.300 సగటు ఆదా యం మాత్రమే వచ్చే తెనాలి - రేపల్లె మార్గంలో ఉన్న జంపని రైల్వే స్టేషన్‌ని మూసేయకుండా రైల్వే అధికారులు సమర్ధించారు. అలాం టప్పుడు మందపాడు రైల్వేస్టేషన్‌ని శాశ్వతంగా మూసేసే విషయంలో ఎందుకు జస్టిపికేషన్‌ ఇవ్వలేకపోయారో నన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఒకపక్క రైలుమార్గం నిర్మాణంతో గ్రామీణ ప్రాంతా లు అభివృద్ధి చెందుతాయని రైల్వే శాఖ చెబుతూ మరోవైపు ఉన్న స్టేషన్లను తొలగిస్తోండటంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 

Updated Date - 2021-10-26T05:01:12+05:30 IST