ప్రజా సంబంధాల్లో బెజవాడ భేష్‌

ABN , First Publish Date - 2022-08-08T06:49:19+05:30 IST

ఉత్తమ ప్రజా సంబంధాలను నెలకొల్పటంలో విజయవాడ రైల్వేడివిజన్‌ ప్రత్యేకతను చాటుకుంది. జాతీయ స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్‌ ప్రజా సంబంధాల అధికారిణి నుస్రత్‌ మండ్రుపకర్‌ బెస్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ మేనేజర్‌ 2021-22 అవార్డును సాధించారు.

ప్రజా సంబంధాల్లో బెజవాడ భేష్‌

- 2021-22 జాతీయ బెస్ట్‌ పీఆర్‌ మేనేజర్‌గా నుస్రత్‌ 

- విజయవాడ డివిజన్‌ రైల్వే పీఆర్‌ఓగా బాధ్యతలు

- హైదరాబాద్‌లో అవార్డు ప్రదానం 

విజయవాడ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : ఉత్తమ ప్రజా సంబంధాలను నెలకొల్పటంలో విజయవాడ రైల్వేడివిజన్‌ ప్రత్యేకతను చాటుకుంది. జాతీయ స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్‌ ప్రజా సంబంధాల అధికారిణి నుస్రత్‌ మండ్రుపకర్‌ బెస్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ మేనేజర్‌ 2021-22 అవార్డును సాధించారు. పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎ్‌సఐ) నేతృత్వంలో హైదరాబాద్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో నుస్రత్‌ అవార్డును స్వీకరించారు. 15వ ప్రజా సంబంధాల వైజ్ఞానిక దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా వివధ రంగాల్లో ఉత్తమ ప్రజాసంబంఽధాలశాఖ అధికారులకు అవార్డులను ప్రదానం చేయటం జరిగింది. పీఆర్‌ఎ్‌సఐను డాక్టర్‌ సీవీ నరసింహారెడ్డి ప్రారంభించారు. ప్రతి ఏటా ఈ సంస్థ నేతృత్వంలో ఉత్తమ అవార్డులు ఇవ్వటం జరుగుతోంది. విజయవాడ రైల్వే పీఆర్‌ఓగా నుస్రత్‌ పనిచేస్తున్నారు. ఆమె ముంబయి సర్‌ జేజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. ప్రజా సంబంధాలకు సంబంధించి మాస్టర్స్‌ డిగ్రీ మాస్‌ కమ్యూనికేషన్‌ చేశారు.‘ఇగ్నో’లో జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌లోపోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. అనేక సంస్థల్లో ప్రజా సంబంధాల విభాగాల్లో పనిచేశారు. 2019లో విజయవాడ రైల్వే డివిజన్‌కు పీఆర్‌ఓగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి నుంచి ఆదివారం నుస్రత్‌ ఈ అవార్డును స్వీకరించారు.


Updated Date - 2022-08-08T06:49:19+05:30 IST